Jupally Krishna Rao: జూపల్లికి ఝలక్‌.. తేల్చిచెప్పేసిన ఢిల్లీ అధిష్ఠానం

స్వతంత్ర వెబ్ డెస్క్: గడిచిన రెండు నెలలుగా చెప్తున్న కొల్లాపూర్‌లో చేరికల సభ అటకెక్కింది. ప్రియాంక గాంధీ సమక్షంలో తాను కాంగ్రెస్‌లో చేరుతానంటూ ఆయన చెప్తున్న మాటలు నీటిమూటలయ్యా యి. అదిగో.. ఇదిగో అంటూ ఆయన చెప్పిన తేదీలన్నీ ఉత్తుత్తువే అని తేలిపోయింది. గడిచిన రెండు నెలలుగా జూపల్లి కృష్ణారావు తాను కొల్లాపూర్‌లో భారీ సభ పెట్టి పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్‌లో తన చేరిక సభ లక్షల మందితో ఉంటుందని, దీనికి పార్టీ హైకమాండ్‌ మొత్తం తరలివస్తుందని చెప్తూ వచ్చారు. అధిష్ఠానం నుంచి ఆయనకు అనుకున్న స్థాయిలో స్పందన రాలేదు. తొలుత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేరిక, భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభల్లో వచ్చి చేరాలని ఏఐసీసీ పెద్దలు చెప్పారు. అయితే, జూపల్లి మాత్రం ససేమిర అన్నారు.

తాను కొల్లాపూర్‌లో సభ పెడ్తానని, దీనికి పార్టీ అగ్రనాయకురాలు ప్రి యాంక గాంధీ రావాలని షరతు పెట్టారు. కొల్లాపూర్‌కు జూలై 20న రావాలని ప్రియాంకను కోరగా ఆమె ఒప్పుకోలేదు. జూలై 25న వస్తారని, ఆ రోజే సభ నిర్వహంచి కాంగ్రెస్‌లో చేరుతానని చెప్పారు. కానీ, ప్రియాంక రాకపోవడంతో సభను జూలై 30కి వాయిదా వేసుకున్నారు. అప్పటికీ రాకపోగా ఆగ స్టు 2కు మార్చాడు. ఒకవేళ ఆగస్టు 2న రాకపోతే ఆగస్టు 5న పక్కాగా చేరిక ఉంటుందని చెప్పారు. కానీ, ఏఐసీసీ పెద్దలు జూపల్లి ప్రతిపాదనలకు ససేమిరా అన్నారు. ‘కొంతమంది మాజీ ఎంపీటీసీ స భ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యు లు బుధవారం ఢిల్లీకి వచ్చి పార్టీలో చేరుతున్నారని, మిమ్మల్ని కొల్లాపూర్‌కు వచ్చి చేర్చుకునేంత తీరిక లేదు. అంత పెద్ద నేతలు కూడా మీ దగ్గర ఎవ్వరు లేరు. మీకు వీలైతే చేరండి.. లేకపోతే లేదు. మరో సందర్భంలో చూసుకుందాం’ అంటూ ఢిల్లీ అధిష్ఠానం తేల్చి చెప్పింది. ఇక తప్పని పరిస్థితుల్లో ఆయన బుధవారం ఢిల్లీలోనే చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు అనుచరులకు మంగళవారం వాట్సాప్‌ మెసేజ్‌లు పంపారు.

Latest Articles

తెలంగాణలో భారీ వర్షాలు…ప్రాజెక్టులకు జలకళ

ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో SRSP,కడెం, ఎల్లంపల్లి, జురాల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు నిండుకుండలా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్