జగన్‌పై సీబీఐ విచారణ చేయించాలన్నారు ఏపీ పీసీసీ చీఫ్ వై.ఎస్ షర్మిల. గౌతమ్ అదానీ నుంచి 17 వందల 50 కోట్ల మేర ముడుపులు అందుకున్న వ్యవహారంలో.. మాజీ సీఎం జగన్‌పై సిట్టింగ్ జడ్జితోపాటు సీబీఐతోనూ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు షర్మిల. నాటి జగన్ ప్రభుత్వం చేసుకున్న అక్రమ ఒప్పందాల కారణంగా ప్రజలపై లక్షన్నర కోట్లమేర భారం పడుతుందని ఆరోపించారామె. అందుకే వాటిని తక్షణమే రద్దు చేయాలని లేఖలో కోరారు షర్మిల.