ఇందిరాగాంధీకే భయపడలేదు.. మరుగుజ్జు జగన్‌ కు భయపడతామా..? – లోకేష్‌

స్వతంత్ర వెబ్ డెస్క్: ఇందిరాగాంధీకే భయపడలేదు.. మరుగుజ్జు జగన్‌ కు భయపడతామా..? అంటూ నారా లోకేష్‌ ఫైర్‌ అయ్యారు. భోజనంలో విషం కలపడం.. బాబాయిని లేపేయడం వంటివి జగన్ DNAనే అంటూ నారా లోకేష్ ఆగ్రహించారు. టీడీపీ విస్తృత స్థాయీ సమావేశంలో నారా లోకేష్‌ మాట్లాడుతూ… నా తల్లి.. బ్రహ్మాణిలు కలిసి చంద్రబాబుకు భోజనంలో విషం కలుపుతారట…భోజనంలో విషం కలపడం.. బాబాయిని లేపేయడం వంటివి జగన్ డీఎన్ఏనే అంటూ ఫైర్‌ అయ్యారు.  స్కిల్ కేసులో ఆధారాల్లేక కార్యకర్తలిచ్చిన పార్టీ ఫండ్.. అవినీతి సొమ్ము అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన తల్లిపై కేసు పెడతామని సీఐడీ బెదిరించిందంటూ లోకేష్ వెల్లడించారు. తన తల్లి, తన భార్య కలిసి చంద్రబాబును చంపేందుకు కుట్రలు పన్నారంటూ మంత్రులు విమర్శిస్తారా..? అంటూ లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీకి సంక్షోభాలు కొత్తేం కాదు…ఇందిరాగాంధీ సీఎంగా ఉన్న ఎన్టీఆరు భర్తరఫ్ చేస్తే మన నేతలు పోరాడారు….కానీ ఆ సంక్షోభం వేరు.. ఈ సంక్షోభం వేరన్నారు. చంద్రబాబును జైల్లో ఉంటే టీడీపీ భయపడుతోందని జహన్ అనుకున్నారు….భయం అనేదే టీడీపీ బయోడేటాలో లేదని వెల్లడించారు. ఇందిరాగాంధీకే భయపడలేదు.. మరుగుజ్జు జగనుకు భయపడతామా..? వ్యవస్థలను మేనేజ్ చేసి టీడీపీని ఇబ్బంది పెడుతున్నారు….చంద్రబాబు ఫ్యామ్లీని ఇబ్బంది పెట్టడమే సైకో జగన్ లక్ష్యమని స్పష్టం చేశారు.

Latest Articles

వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల

మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్