30.6 C
Hyderabad
Monday, April 21, 2025
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

సబ్సిడీ పై విత్తనాలకు వినతి పత్రం

నిర్మల్ జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో రైతులు పండించిన ధాన్యానికి ఎరువులు, విత్తనాలు 50శాతం సబ్సిడీపై అందించాల ని భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భం గా జిల్లా అధ్యక్షులు రామయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలలో 2 లక్షల రుణమాఫీని ఏకకాలం లో అమలుచేసి, విద్యుత్ కొరత లేకుండా అందించాలని జిల్లా అధ్యక్షులు రామయ్య కోరారు. పంటల భీమాను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

కాలినడకన తిరుమల వెళ్లిన టీడీపీ నాయకులు

చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యేగా అమరనాథ రెడ్డి గెలవడంతో తమ మొక్కును చెల్లించుకోవడానికి 30 మంది గంగవరం మండలం జీడిమాకులపల్లి వాసులు గ్రామం నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లారు.ఎన్నికల్లో అమరనాథరెడ్డి గెలుస్తే వెంకటేశ్వరస్వామికి తలనీలాలు సమర్పించుకుంటామని గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మొక్కుకున్నారు. దీంతో మొక్కు చెల్లించుకోవడానికి తిరుమలకు వెళ్లారు.

గ్రామదేవతలకు అభిషేకం

రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామస్థులు గ్రామ దేవతలకు జలాభిషేకాన్ని నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులంతా గోదావరి నుంచి తీసుకొచ్చిన నీళ్లతో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి డప్పు చప్పుళ్లు మధ్య గ్రామం లో ఊరేగించారు. అనంతరం గ్రామంలో ఉన్న 130దేవాలయాల్లోని దేవతామూర్తులను గోదావరి నీటితో అభిషేకాలు చేస్తూ భక్తి శ్రధ్ధలతో కొలిచారు.

వాటర్ ట్యాంకులో విష ప్రయోగం

అనంతపురం జిల్లా కనేకల్ మండలంలోని తుంబిగినూరు గ్రామంలో ఫిల్టర్ వాటర్ ప్లాంట్‌పై విష ప్రయోగం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు వాటర్‌ ప్లాంట్‌ ట్యాంకులో విషప్రయోగం చేశారని పోలీసు లకు ఫిర్యాదు చేశారు. ఉదయం నీటి కోసం వెళ్లిన గ్రామస్తులు ట్యాంక్ దగ్గర క్రిమిసంహారక మందు డబ్బా పడినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని ఘటనాస్థ లాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.

ఆత్మ హత్యాయత్నం

కామారెడ్డి జిల్లా షేర్‌ గల్లీలో ఇద్దరు పిల్లలకు ఎలుకల మందు తాగించి తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాంత్‌, రాజ్యలక్ష్మీ భార్యాభర్తలు. శ్రీకాంత్‌ ఎలాంటి పని చేయకుండా జులాయిగా తిరగడంతో భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. నిన్న భార్యాభర్తల మధ్య వాగ్వాదం తీవ్రం కావడంతో శ్రీకాంత్‌ ఎలుకల మందు సేవించి ఇద్దరు పిల్లలకు తాగించాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

యువకుడి హత్య

తిరుపతి జిల్లా ఆటోనగర్‌లో యువకుడు హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో గుర్తు తెలియని వ్యక్తు లు గొంతు కోసి హత్య చేశారు. మృతుడు ముంగిలి పట్టుకు చెందిన మాదం ప్రసాద్‌గా పోలీసులు గుర్తిం చారు. కొంతమంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ప్రధాన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

అనుమానాస్పద మృతి

హైదరాబాద్‌కు బతుకుదెరువు కోసం వచ్చిన కుటుంబంలో విషాదం నెలకొంది. మియాపూర్‌లో కూలి పనులు చేస్తూ జీవిస్తున్న నరేష్‌ కూతురు వసంత ఈ నెల 7న అదృశ్యమైంది. చుట్టుపక్కల ఎంత వెతికి నా ఆచూకీ లభించలేదు. దీంతో నరేష్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఏడు రోజుల తర్వాత మియా పూర్‌ జంగల్లో బాలిక మృతదేహం కుళ్లిన స్థితిలో లభ్యమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest Articles

దర్శకుల సమక్షంలో ‘ఏఎల్‌సీసీ’ బిగ్ టికెట్ లాంచ్

యెల్ ఆర్ ఫిల్మ్ సర్కూట్స్ బ్యానర్‌పై లేలీధర్ రావు కోలా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఏ ఎల్ సి సి’ (ఓ యూనివర్సల్ బ్యాచిలర్). రీసెంట్ గా ఈ సినిమా ట్రెయిలర్ విడుదలై...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్