HYD| ప్రభుత్వ భూమి ఇంచు కనిపించినా చాలు.. ఎలాగయినా దానికి ఆక్రమించాలని చూస్తుంటారు అక్రమార్కులు. ఈ క్రమంలోనే చాలావరకు రాజధాని హైదరాబాద్ లో ఆక్రమించుకున్నారు. ఇప్పుడు రాజధాని శివార్లపై కూడా వారి కన్ను పడింది. కబ్జాదారుల ఆగడాలు పెరిగిపోడంతో హైదరాబాద్ లో అక్రమార్కులపై హెచ్ఎండీఏ ఉక్కుపాదం మోపింది. ప్రభుత్వ భూమికి కాపాడేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఆపరేషన్ శంషాబాద్ చేపట్టి భూముల చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్నారు. తప్పుడు రికార్డులతో ప్రభుత్వ భూములను ఆక్రమించే ప్రయత్నం చేపట్టారు కొందరు అక్రమార్కులు. శంషాబాద్ లో హెచ్ఎండీఏకు ఉన్న 181 ఎకరాలలో దాదాపు 50 ఎకరాల భూమి కబ్జా గురవుతుందని తెలుసుకున్న అధికారులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.