31.2 C
Hyderabad
Thursday, May 7, 2026
spot_img

ప్రభాకర్ సరికొత్త సీరియల్ ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ రేపే ప్రారంభం

తెలుగువారు ఎంతో అభిమానించి, ఆశీర్వదిస్తున్న నెంబర్ వన్ ఛానల్ “స్టార్ మా”- సీరియల్ కథల ఎంపికలో ఎప్పుడూ ఒక విలక్షణమైన పంథా అనుసరిస్తూ వస్తోంది. ఇదే “స్టార్ మా” విజయ సూత్రం కూడా. అదే వరసలో ఈసారి విభిన్నమైన అనుబంధాల వెలుగునీడలతో వినూత్నమైన కథని అందిస్తోంది. ఆ సీరియల్ పేరు “ఇల్లు ఇల్లాలు పిల్లలు”.

ఒకరినొకరు అర్ధం చేసుకునే భార్యాభర్తలు, బంగారం లాంటి పిల్లలు ఉంటే ఆ ఇంట్లో ఆనందాలకు కొదవే ఉండదు. ఇలాంటి ఆప్యాయతలు అల్లుకున్న ఓ అందమైన కుటుంబం కథ ఇది. ఈ సంతోషాల వెనుక వెల కట్టలేని ప్రేమ వుంది. అంతే కాదు – మనసుని మెలిపెట్టే ద్వేషం కూడా వుంది. ఇద్దర్ని కలిపిన ప్రేమ.. రెండు కుటుంబాల్ని దూరం చేస్తే… ఎన్ని సంతోషాలున్నా ఏదో బాధ అందరినీ వెంటాడుతుంది. అసలు ఆ కుటుంబంలో ఏం జరిగింది? ఆ ప్రేమ, ద్వేషం తాలూకు కథ ఏమిటి? ఎదురు ఎదురుగా ఉన్న రెండు కుటుంబాలు బద్ధ శత్రువులుగా మారిపోయిన కథ ఏమిటో “స్టార్ మా” సరికొత్త సీరియల్ “ఇల్లు ఇల్లాలు పిల్లలు” చెప్పబోతోంది. ఈ నెల 12 నుంచి రాత్రి 7 . 30 ని. లకు ఈ సీరియల్ ప్రారంభం కానుంది. సోమవారం నుండి శనివారం వరకు నాన్ స్టాప్ గా ఈ కథ , మనకెంతో పరిచయమైన ట్టుగా అనిపించే పాత్రలు మీ ముందుకు రానున్నాయి. నిస్సహాయంగా నిలిచిపోయిన అనుబంధాలు, మమకారాల్ని మసిచేసిన ఆనాటి ప్రేమ మంటల మధ్య సంఘర్షణే ఈ కథ.

తెలుగు టెలివిజన్ ఫిక్షన్, నాన్ ఫిక్షన్ విభాగాల్లో ఎన్నో విభిన్నమైన బాధ్యతల్ని విజయవంతంగా నిర్వహించిన సీనియర్ నటుడు, షో ప్రెజెంటర్, నిర్మాత, సంధానకర్త ప్రభాకర్ ఈ సీరియల్ లో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ఎన్నో తెలుగు సినిమాల్లో విలక్షణమైన పాత్రల్లో కనిపించిన హీరోయిన్ ఆమని ప్రభాకర్ భార్యగా నటిస్తున్నారు. స్టార్ మా లో ప్రసారమైన ప్రోమోలు ఈ సీరియల్ గురించి ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాయి. రెండు కుటుంబాల్లో ప్రేమ రగిల్చిన కక్షలు.. ప్రేమాభిమానాల్ని ఎలా సమాధి చేస్తాయో చూపించడమే కాదు.. ఆ జంట పోగొట్టుకున్న ప్రేమాభిమానాల్ని పొందడానికి ఎంత కష్టపడ్డారో చెబుతుంది “ఇల్లు ఇల్లాలు పిల్లలు” ఇది ప్రతి ఒక్క ఇంటి కథ. ఇది ప్రతి ఒక్కరి గుండెని తాకే కథ. ఈ నెల 12 నుంచి రాత్రి 7 . 30 ని. లకు ఈ సీరియల్ ప్రారంభం కానుంది. సోమవారం నుండి శనివారం వరకు “స్టార్ మా”ప్రేక్షకుల్ని అలరించబోతోంది.

Latest Articles

కవిత టార్గెట్ అన్న కేటీఆరేనా?

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబ పోరు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. కొత్త పార్టీ పెట్టిన కవితను ఏమాత్రం పట్టించుకోవద్దని, ఎవరెవరో వస్తుంటారు పోతుంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ కేడర్‌కు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్