స్వతంత్ర వెబ్ డెస్క్: టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆయన ఫ్యాన్స్, ఐటి ఉద్యోగులు తలపెట్టిన ‘లెట్స్ మెట్రో ఫర్ సిబిఎన్’ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈరోజు ఉదయం 10:30 గంటల నుంచి 11:30 మధ్యలో మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు నల్ల టీషర్టులతో ప్రయాణించాలని ఫ్యాన్స్ భావించారు. దీంతో మియాపూర్ మెట్రోను పోలీసులు మూసేశారు. మెట్రో స్టేషన్లలో బ్లాక్ టీషర్టులు ధరించిన వారిని వెనక్కి తిప్పి పంపిస్తున్నారు. మరోవైపు ఎల్బీనగర్ మెట్రోస్టేషన్ వద్ద నల్ల టీషర్ట్ వేసుకొని వచ్చిన యువకులను అడ్డుకోవడంతో.. పక్కనే ఉన్న డీ – మార్టులోకి వెళ్లి ఇతర రంగు టీషర్ట్‌లు కొనుగోలు చేసి వెళ్తున్నారు. శనివారం ఉదయం 10.30 – 11.30 గంటల మధ్య మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకూ నల్ల టీషర్టులు ధరించి మెట్రోలో ప్రయాణించాలని చంద్రబాబు అభిమానులు పిలుపునిచ్చారు. మెట్రో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఈ శాంతియుత నిరసన చేపట్టాలని నిర్ణయించారు.
భారీగా చంద్రబాబు ఫ్యాన్స్.. మియాపూర్ మెట్రో మూసివేత
0
297
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


