గంజాయి సాగు చేసినా.. తరలించినా పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. ఏపీ శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు హోంమంత్రి అనిత సమాధానాలిచ్చారు. ఐదు నెలల్లో 25 వేల కిలోల గంజాయి పట్టుకున్నామని అనిత అన్నారు. గతంలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ రెచ్చిపోయిందని గుర్తు చేశారు. యాంటీ నార్కొటిక్స్ టాస్క్‌ఫోర్స్‌తో నేరస్థులను అణచివేస్తామని తెలిపారు. గంజాయిపై గత ఐదేళ్లలో జగన్ ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని విమర్శించారు. లోన్ యాప్ ల పేరుతో వేధించే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నామని అనిత తెలిపారు.
ఏపీ అసెంబ్లీలో హోం మంత్రి అనిత కీలక ప్రకటన
0
154
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


