స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: సీనియర్ నటుడు శరత్ బాబు(71) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. నేటి ఉదయం నుంచే ఆయన అవయవాలు పనిచేయడం మానేశాయని వైద్యులు తెలిపారు. 1951 జులై 31న శ్రీకాకుళం జిల్లా అముదాలవలసలో జన్మించిన ఆయన అసలు పేరు శతర్ బాబు దీక్షిత్. 1973లో రామరాజ్యం సినిమాతో శరత్ బాబు సినిమాల్లోకి అరంగేట్రం చేశారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 300కు పైగా సినిమాల్లో ఆయన హీరోగా, విలన్, నటుడిగా నటించారు. ఆయన చివర చిత్రంగా ‘మళ్లీ పెళ్లి’ సినిమాలో నటించారు. శరత్ బాబు మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తంచేస్తున్నారు.
బిగ్ బ్రేకింగ్: సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత
0
423
- Tags
- MOVIES
- Sarathbabu
Previous article
Next article
Latest Articles
ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -
- Advertisement -


