నేడు కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ

   ఢిల్లీ లిక్కర్‌ స్కామ్ కేసులో బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిన్లపై ఇవాళ విచారణ జరగనుంది. కవిత బెయిల్ పిటిషన్లపై నిన్న వాదలు జరిగాయి. కవిత తరపున సీనియర్‌ లాయర్‌ విక్రమ్‌ చౌదరి వాదనలు వినిపించారు. కవిత అరెస్టులో దర్యాప్తు సంస్థలు చట్టాన్ని ఉల్లంఘించారని వాదనలు వినిపిం చారు. ఇవాళ కౌంటర్‌ వాదనలు వినిపిస్తామని ఈడీ అధికారులు చెప్పారు. దీంతో విచారణను నేటికి వాయిదా పడింది. అలాగే సీబీఐ కూడా ఈ రోజు వాదనలు వినిపించే అవకాశం ఉంది.

   ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్, కవితను అరెస్ట్ చేసేందుకు ట్రయల్ కోర్టు అనుమతి, సీబీఐకి కస్టడీ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ఆమె ఢిల్లీ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను సింగిల్  బెంచ్ గత శుక్రవారం విచా రించింది. మద్యం కుంభకోణంలో 50 మంది నిందితుల్లో కవిత ఒక్కరే మహిళ అని, మహిళా చట్టం ప్రకారం ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదించారు. కవిత బెయిల్ పిటిషన్లపై ఈడీ కౌంటర్ దాఖలు చేయగా, సీబీఐ సమయం కోరింది. మద్యం కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ఈడీ అరెస్టు చేసింది. 16వ తేదీన రౌస్‌ అవెన్యూ కోర్టులో ఆమెను హాజరుపరిచింది. తీహార్ జైలులో జ్యుడీ షియల్ కస్టడీలో ఉన్న కవితను ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. మరోవైపు కుమారుడికి పరీక్షల నేపథ్యంలో మధ్యం తర బెయిల్, రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. మార్చి 26న ట్రయల్ కోర్టు జ్యుడీషి యల్ కస్టడీ విధించగా.. తీహార్ జైలులో ట్రయల్ ఖైదీగా కవిత దాదాపు రెండు నెలల పాటు ఉన్నారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్