ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు లో విచారణ జరగనుంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం విచారణ జరపనుంది. ఈడీ , సీబీఐ కేసుల్లో తనకు బెయిల్ తిరస్కరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కవిత హైకోర్టులో పిటిషన్ వేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ, ఈడీ, సీబీఐ కేసుల్లో మే 6న కవిత బెయిల్ పిటిషన్లను ట్రయల్ కోర్టు తిరస్కరించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత పాత్ర ఉందని ఆమెకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ ట్రయల్ కోర్టు బెయిల్ తిరస్కరించింది. లిక్కర్ పాలసీ ఈడీ కేసులో మార్చి 16న, సీబీఐ కేసులో ఏప్రిల్ 11న కవిత అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైలులో ఉన్నారు.
కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ
0
317
Previous article
Next article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


