తెలంగాణ వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రవ్యాప్తంగా బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. అరెస్టు చేసిన బిఆర్ఎస్ శ్రేణులను వెంటనే విడుదల చేయాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయకుండా, బిఆర్ఎస్ శ్రేణులను అరెస్టులు చేయడం అప్రజాస్వామికమన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన గాంధీ, వారి అనుచరులు, కాంగ్రెస్ గూండాలను అరెస్టు చేయాలని హరీశ్ రావు ట్వీట్ చేశారు.
బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులను ఖండించిన హరీశ్ రావు
0
337
Previous article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


