గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. నాలుగు పేర్లు పరిశీలనలో ఉన్నాయని, ఆల్ఫోస్ విద్యా సంస్థల ఛైర్మన్ నరెందర్ రెడ్డి పేరు చాలా మంది చెప్పారని పేర్కొన్నారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్ర పక్షాలకు మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే దానం నాగేందర్ వాఖ్యలను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. వచ్చే 20 ఏళ్ళను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని కేసి వేణుగోపాల్ గట్టి వార్నింగ్ ఇచ్చారని చెప్పారు. అందరి రిపోర్ట్ కేసీ వేణుగోపాల్ దగ్గర ఉందన్నారు.
ఈనెల 14న ఢిల్లీకి వెళ్తున్నామని, 15న ఏఐసీసీ ఆఫీస్ ప్రారంభోత్సవంలో పాల్గొంటామని చెప్పారు. ఈ నెల చివరి నాటికి పార్టీలో అన్ని కమిటీలు వేస్తామని, పని చేసిన వారందరికీ పదవులు ఇస్తామని స్పష్టం చేశారు. పని చేసిన నాయకులకే పదవులు వస్తాయన్నారు. కార్పోరేషన్ పదవుల భర్తీ నెలఖారులో పూర్తవుతుందని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.