ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇక పై సెల్ ఫోను లో ‘ఆరోగ్యశ్రీ’

స్వతంత్ర వెబ్ డెస్క్: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..ఇక పై సెల్ ఫోను లో ‘ఆరోగ్య శ్రీ’ పూర్తి వివరాలు తెలుస్కోవచ్చును. సెల్ ఫోను లో ఉన్న ‘ఆరోగ్యశ్రీ’ యాప్ ద్వారా నెట్వర్క్ ఆస్పత్రులు, వైద్య పరీక్షలు, చికిత్స సమాచారం తెలుసుకునేందుకు వీలు కల్పించింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. మెడికల్ రిపోర్టుల డౌన్లోడ్ కూ వెసులుబాటు కల్పించింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. ఆరోగ్యశ్రీ కార్డుదారుల ఫోన్లలో యాప్ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దింతో ఇప్పటి వరకూ 6.83 లక్షల మంది పోన్లలో యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఇది ఇలా ఉండగా, గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలను ప్రభుత్వం మరింత విస్తరించింది. తొలి దశలో 51, రెండవ దశలో 1,500 గ్రామాల్లో సేవలు అందుబాటులోకి తీసుకురాగా, తాజాగా 2,526 సచివాలయాలకు అనుమతులు మంజూరు చేసింది. అక్కడ పనిచేసే కార్యదర్శులకే జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హోదా కల్పించింది. భూముల రీసర్వే పూర్తయి, LPM(ల్యాండ్ పార్సిల్ నంబర్) వచ్చిన గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు మొదలవుతాయి.

Latest Articles

సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ మసూద్ చాందీ దారుణ హత్య

హైదరాబాద్‌లో ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ మసూద్ చాందీ దారుణ హత్యకు గురయ్యాడు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దుండగులు మసూద్ చాందీపై దాడి చేసి హత్య చేసినట్లు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్