సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. దసరా కానుక నిధులు విడుదల

స్వతంత్ర వెబ్ డెస్క్: సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దసరా కానుకగా సింగరేణి కార్మికులకు  లాభాల వాటాగా బోనస్ రూ.711.18 కోట్లను విడుదల చేశారు. ఈనెల 16న చెల్లించనున్నట్టు సింగరేణి సంస్థ చైర్మన్, ఎం.డీ. ఎన్.శ్రీధర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు ఇవాళ బోనస్ విడుదల చేశారు.  ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విధంగా.. గత ఏడాది సింగరేణి సాధించిన రూ.2222.46 కోట్ల రూపాయలతో 32 శాతం లాభాల బోనస్ ను దసరా పండుగకు వారం రోజుల ముందే చెల్లించనున్నట్టు తెలిపారు.

సగటున ఒక్కో ఉద్యోగికి రూ.1లక్ష 53వేల వరకు లాభాల బోనస్ అందనుందని పేర్కొన్నారు. సింగరేణి సంస్థను లాభాల దిశగా నడిపిస్తున్న కార్మికులకు గతంలో కంటే ఎక్కువ శాతాన్ని లాభాల వాటాగా ప్రకటించిన సీఎం కేసీఆర్ కు సింగరేణి ఉద్యోగుల తరపున చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు. బోనస్ చెల్లింపుపై డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ పర్సనల్ బలరాం గురువారం ఓ సర్క్యూలర్ జారీ చేశారు.

Latest Articles

మళ్లీ మొదలేట్టేసిన.. హిట్ మిషన్..

హిట్ మిషన్.. అనగానే ఠక్కున గుర్తొచ్చే డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆయన డిఫరెంట్ గా ప్రమోట్ చేసినట్టుగా మరో డైరెక్టర్ ఎవరూ ప్రమోట్ చేయలేరు. ఇది నిజంగా నిజం. కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచే.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్