Gold Price Today |ప్రధాన నగరాల్లో పసిడి ధరలు.. బంగారం కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి..

Gold Price Today  |బంగారం అంటే ఇష్టపడని వారెవరుంటారు. తమ దగ్గర డబ్బులుంటే సామాన్య, మధ్య తరగతి ప్రజల్లో ఎక్కువమంది బంగారంపై పెట్టుబడి పెడుతుంటారు. అయితే బంగారం లేదా వెండి కొనుగోలు చేసేటప్పుడు చాలామంది తమకు నమ్మకమైన దుకాణాల్లో కొనుగోలు చేస్తూ ఉంటారు. మరికొంతమంది అయితే పేరెన్నిక గల జ్యూయలరీ షాపుల్లో బంగారం కొంటుంటారు. ప్రధానంగా బంగారం కొనేముందు ధర ఎలా ఉంది అనేది చూస్తూ ఉంటారు. అదే సమయంలో ఒక్కో దుకాణంలో ధరల విషయంలో స్వల్ప మార్పులు ఉంటాయి. తరుగులో కూడా ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది. ముఖ్యంగా చూడాల్సింది బంగారంలో నాణ్యత.. కొంతమంది నాణ్యత లేని బంగారాన్ని విక్రయిస్తుంటారు. అందుకే మనం కొనుగోలుచేసే పసిడి నాణ్యత ఎంతో చెక్‌ చేయించుకోవడం ఉత్తమం. ఇక ఈరోజు (మార్చి4) ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

శుక్రవారంతో పోలిస్తే శనివారం రోజు బంగారం ధరల్లో ఎటువంటి మార్పులేదు. ఒక చెన్నైలో మినహా మిగిలిన చోట్ల బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. గురువారంతో పోలిస్తే శుక్రవారం చెన్నైలో 10 గ్రాముల బంగారంపై సుమారు 30 నుంచి 40 రూపాయల వరకు తగ్గింది. దేశంలోని బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,750 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,450 గా ఉంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో ఏ సమయంలోనైనా పెరగవచ్చు. తగ్గవచ్చు. మీరు బంగారం కొనుగోలు చేసే సమయానికి ముందు ధరలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Gold Price Today  |తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,450 గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,450గా ఉంది.

విశాఖటపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,450 గా ఉంది.

ప్రధాన నగరాల్లో..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,750ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,440గా ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,290గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160గా ఉంది.

* బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,340గా ఉంది.

 Read Also: ప్రభాస్ రికార్డును బద్దలుకొట్టిన షారుఖ్

Follow us on:   Youtube   Instagram

Latest Articles

శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్

శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చారని అన్నారు. ఈ తీర్పును అధికారులు కూడా గౌరవించాలని చెప్పారు. 2029లో 2024 కంటే ఎక్కువ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్