గ్రామీణ విద్యార్థినిలు ఉన్నత శిఖరాలు చేరుకునేందుకు భరోసా కల్పించే కార్యక్రమాన్ని NTPC యాజ మాన్యం తీసుకోవడం సంతోషంగా ఉందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం NTPC కాకతీయ హాల్లో గరల్స్ ఎంపవర్‌మెంట్ మిషన్ కార్యక్రమాన్ని ఈడీ కేదార్ రంజన్ పాండేతో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత బాలికలకు మనో ధైర్యాన్ని కల్పించేందుకు NTPC యాజమాన్యం కరాటే, యోగా వంటి శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం హర్షణీయం అన్నారు. సాధికారత దిశగా బాలికలను ప్రోత్సహిస్తూ వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు కుటుంబ సభ్యులతో పాటు సమాజం ప్రోత్సహించాలన్నారు. బాలికలు సాంకేతికతను ఉపయోగించుకొని అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. బాలికల్లో మనోధైర్యాన్ని నింపి భరోసా కల్పించినప్పుడు వారు అన్ని రంగాల్లో రాణిస్తారని ఆయన ఆశా భావం వ్యక్తం చేశారు.
రామగుండం ఎన్టీపీసీ కాకతీయ హాల్లో గర్ల్స్ ఎంపవర్మెంట్ మిషన్
0
284
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


