మాజీ ఎంపీ రమేష్ రాథోడ్‌ కన్నుమూత

     ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఉట్నూర్‌లోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటీన కుటుంబసభ్యులు జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను హైదరాబాద్‌కు తరలి స్తుండగా మార్గమధ్యంలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్లు పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన రమేశ్‌రాథోడ్‌ బీజేపీలో చేరారు. రమేష్‌ రాథోడ్‌ 2009లో ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2018లో ఖానాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీచేసి ఓడిపోయారు. రమేష్ రాథోడ్ అట్టడుగు స్థాయి నుంచి రాజకీయ ఎదిగారు. 1999లో ఖానాపూర్ అసెంబ్లీ స్థానం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 2006–2009 మధ్య కాలంలో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిం చారు. ఆయన భార్య సుమన్ రాథోడ్ ఖానాపూర్ అసెంబ్లీ స్థానానికి 2009–2014 ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అనంతరం ఖానాపూర్ అసెంబ్లీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రమేశ్ రాథోడ్. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. జూన్ 2021లో ఈటల రాజేందర్ ‌తో పాటు భారతీయ జనతా పార్టీలో చేరారు.

Latest Articles

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి

         ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా  తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్‌ చేసి దాడికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్