Flipkart Big Saving Days sale: ఆగస్టు 4 నుంచి 9 వరకు.. బీ రెడీ..!

స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రముఖ ఈ- కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ సేవింగ్ డేస్ తేదీలను ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్ స్వాతంత్ర్య దినోత్సవంకి కొద్ది రోజుల ముందు.. బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను ప్రకటించింది. ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్ ఆగస్ట్ 4న ప్రారంభమై ఆగస్టు 9 వరకు మొత్తం 5 రోజుల పాటు కొనసాగుతుంది. ఇప్పటికే దీనిపై టీజర్‌ను రివీల్ చేసింది. విక్రయానికి రానున్న కొన్ని ఫోన్‌ల లిస్టును కూడా వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ 2023 ఆగస్టు 4 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై.. ఆగస్టు 9 మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌ టాప్‌లు, స్మార్ట్ వాచెస్, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, గృహోపకరణాలపై భారీగా డిస్కౌంట్లు ఉండనున్నాయి.

 

ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్‌షిప్‌ యూజర్లు ఒక రోజు ముందుగానే ఈ సేల్‌ అందుబాటులోకి వస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ 2023లో క్రేజీ డీల్స్‌ పేరున అర్థరాత్రి 12 గంటలకు, ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు కొత్త ఆఫర్లు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయి. ‘ఫోర్‌ అవర్‌ డీల్స్‌’ సేల్‌లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రత్యేకమైన ఆఫర్లు ఉండనున్నాయని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. ఇక ఐసీఐసీఐ, కోటక్‌ మహీంద్రా క్రెడిట్‌/డెబిట్‌ కార్డు.. ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్‌ ఉంది. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌, ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ సూపర్‌ ఎలైట్‌ కార్డ్‌పై సూపర్‌ కాయిన్స్‌ లభించనున్నాయి.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో ఐఫోన్ 14, ఐఫోన్ 11 డిస్కౌంట్లు ఇవ్వనుంది. ఈ ప్లాట్‌ఫారమ్ కొన్ని ప్రసిద్ధ 5G ఫోన్‌లపై భారీ తగ్గింపును అందించనుంది. ఐఫోన్‌లతో పాటు, Samsung Galaxy S22+ కూడా సరసమైన ధరలో అందుబాటులో ఉండనుంది. అదేవిధంగా, Pixel 6a, Samsung Galaxy Z Flip 3 మరిన్ని వంటి ఇతర ఫోన్‌లు కూడా రాయితీలను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ 5G ఫోన్‌ల యొక్క ఖచ్చితమైన డీల్ ధర రాబోయే రోజుల్లో లేదా ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఈవెంట్‌కు ముందు వెల్లడించనున్నారు. ఈ సేల్‌లో కొన్ని వస్తువులపై ఏకంగా 70 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌ టాప్‌లు, స్మార్ట్‌ వాచ్‌లు, దుస్తులు, ఫర్నిచర్‌లపై 80 శాతం డిస్కౌంట్‌ ఉండనుంది. టీవీ, ఏసీలు, ఫ్రిడ్జ్‌లపై 75 శాతం.. బ్యూటీ, ఫుడ్‌, టాయ్స్‌పై 85 శాతం వరకు డిస్కౌంట్లు ఉండే అవకాశం ఉంది. వీటిపై ఎంత డిస్కౌంట్‌ ఉంటుందనే వివరాలు సేల్ ఆరంభం అయ్యాక మాత్రమే తెలుస్తుంది.

Latest Articles

ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్