స్వతంత్ర వెబ్ డెస్క్: ధనవంతులైన మత్స్యకారులకు కేరాఫ్ గా అడ్రస్‌గా తెలంగాణ రాష్ట్రం నిలవాలి. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బేగంపేటలోని హరిత ప్లాజా లో నిర్వహించిన జాతీయ మత్స్యకారుల దినోత్సవం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మత్స్యకారుల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వం చెరువులపై మత్స్యకారులకే పూర్తి హక్కులు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా చేప, రొయ్య పిల్లలను పంపిణీ చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వమే అన్నారు. రాష్ట్రం లో గణనీయంగా మత్స్య సంపద పెరుగుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో చేపలను ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ చేరుకుంటుందని స్పష్టం చేశారు. ఇదంతా సీఎం కేసీఆర్ దూరదృష్టి వల్లే సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.