రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి వారం రోజుల పాటు అగ్నిమాపక శాఖ వారోత్సవాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అగ్నిమాపక కేంద్రాల్లో అగ్ని ప్రమాదాలపై అగ్నిమాపక అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఎండా కాలంలో అగ్ని ప్రమాదలు ఎక్కువగా చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అగ్నిమాపక శాఖ వారోత్సవాలు నిర్వహిస్తోంది. అగ్ని ప్రమాదం జరిగిన నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని దానిపై వారం రోజుల పాటు అవగాహన కల్పిస్తారు.