లైఫ్ స్పేస్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం

స్వతంత్ర వెబ్ డెస్క్: బాలానగర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐడిపిఎల్ కాలనీ డీమార్ట్ వెనకాల గల లైఫ్ స్పేసెస్ అపార్ట్ మెంట్ నాలుగవ ఫ్లోర్ లో షార్ట్ సర్క్యూట్ అయి రాత్రి 11 గంటలకు సమయంలో మంటలు ఎగసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో భారీగా పొగలు అలుముకున్నాయి. ఈ క్రమంలో చెలరేగిన మంటలు క్రమంగా మిగతా ప్లాట్స్ కి వ్యాపించడంతో భయాందోళనకు గురైన అపార్ట్‌మెంటు వాసులు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పూర్తిగా తగలబడ్డాయి. అగ్నిప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమా? లేక మరో కారణమా? అనేది తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని.. ఫర్నిచర్ మాత్రం మంటలకు గురైనట్లు అధికారులు తెలిపారు. నిన్న సికింద్రాబాద్ పాలిక బజార్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.

Latest Articles

కాంగ్రెస్‌లో మళ్లీ నామినేటెడ్ పదవుల టెన్షన్ మొదలయ్యిందా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల టెన్షన్ మళ్లీ మొదలైంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం దక్కించుకున్న నేతలకు ఇప్పుడు రెన్యువల్ గుబులు పట్టుకుంది. జూలై నెలాఖరుతో వీరి పదవీకాలం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్