32.2 C
Hyderabad
Saturday, May 16, 2026
spot_img

నాంపల్లి రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వే స్టేషన్లో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్‌లో ఆగి ఉన్న హైదరాబాద్ – జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులోని B1, B2 బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

సాయంత్రం 7.30 గంటలకు బయలుదేరాల్సిన రైలులో సుమారు 6.20 గంటల ప్రాంతంలో పొగలు రావడాన్ని గమనించిన రైల్వే అధికారులు వెంటనే ఫైర్ సిబ్బందికి, హైడ్రా కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బందితో పాటు హైడ్రా DRF బృందాలు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రమాద సమయంలో బోగీల్లో ప్రయాణికులు లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest Articles

కాన్వాయ్ లోని వాహనాలను కుదించుకున్న రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించారు. ఇప్పటివరకు ఎక్కువ వాహనాలతో సాగిన కాన్వాయ్‌ను నాలుగు వాహనాలకు పరిమితం చేసినట్లు సమాచారం. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో పొదుపు చర్యలు పాటించాలని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్