మేడ్చల్ జిల్లాలో విషాదం నెలకొంది. రుణమాఫీ కాలేదని అగ్రికల్చర్ కార్యాలయ ఆవరణలో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్‌లో నివాసం ఉండే రైతు సురేందర్ రెడ్డి తనకు రుణమాఫీ కాలేదని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమీపంలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర చెట్టుకు ఉరేసుకుని సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.