Free Porn
xbporn
27.2 C
Hyderabad
Thursday, September 12, 2024
spot_img

స్వతంత్ర టీవీ చేతిలో బిగ్‌బాస్ సీజన్-8 కంటెస్టెంట్స్ ఎక్స్‌క్లూజివ్ జాబితా

బిగ్ బాస్ అభిమానులకు స్వతంత్ర టీవీ గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సీజన్-8 కంటెస్టెంట్స్‌ జాబితాను ఎక్స్‌క్లూజివ్‌గా ముందుకు తెచ్చింది. ఫోటోషూట్, ప్రోమో షూట్ పూర్తి చేసుకొని..హౌస్‌లోకి వెళ్లబోయే వారి పేర్లను సంపాదించింది.

యాష్మిగౌడ స్వాతి చినుకులు సీరియల్ ద్వారా తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ముకుంద పాత్రలో నటిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ముకుందగా యాష్మి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నిత్యం క్రేజీ ఫోటో షూట్స్ షేర్ చేస్తోంది.

మరో కంటెస్టెంట్ ఆకుల సోనియా ఈమె మోడల్‌, కమ్ యాక్టర్. ఇంకా చెప్పాలంటే రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుంచి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న నటి. రామ్ గోపాల్ వర్మ కరోనా టైంలో తీసిన ‘కరోనా వైరస్’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. నేచురల్ నటి అని వర్మ ప్రశంసలను కూడా దక్కించుకుంది. వర్మ ప్రశంసించాడంటే సోనియా టాలెంట్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి హౌస్‌లో ఆమె మెప్పిస్తోంది అనడంలో సందేహం లేదని టాక్.

ఇంకో కంటెస్టెంట్ బెజవాడ బేబక్క. ఈమె అసలు పేరు మధు నెక్కంటి. విజయవాడకు చెందిన ఈమె అమెరికాలో ఉంటున్నారు. విజయవాడ యాసలో వీడియోలు చేస్తూ యూట్యూబ్‌లో బెజవాడ బేబక్కగా పాపులర్ అయ్యారు.

విష్ణుప్రియ భీమినేని ఈమె మొదట మోడలింగ్ చేసి యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించింది. బుల్లితెరపై అడుగుపెట్టక ముందే పలు షార్ట్ ఫిలిమ్స్ చేసింది. ఆ తర్వాత యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనసూయ, రష్మి గౌతమ్, శ్రీముఖి తర్వాత గ్లామర్‌తో అంతలా..అట్రాక్ట్ చేస్తున్న యాంకర్ల లిస్టులో విష్ణుప్రియ పేరు ముందుంటుంది. పోవే పోరా టెలివిజన్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో పాటు వెబ్ సిరీసుల్లో నటిస్తోంది.

ఆర్జేగా, వీజేగా శేఖర్ బాషా కెరీర్ స్టార్ట్ చేశారు. పలు సినిమాల్లో నటించాడు. రాజ్ తరుణ్, లావణ్య గొడవలు మొదలైనప్పటి నుంచి శేఖర్ భాషా తన మిత్రుడు రాజ్ తరుణ్‌కు మద్దతుగా నిలిచి వార్తల్లోకెక్కాడు. ఇదంతా బిగ్ బాస్‌లోకి వెళ్లడానికే చేస్తున్నారా అని స్వతంత్ర ఇంటర్వ్యూలో అడగ్గా.. బిగ్ బాస్‌లో ఆఫర్ వస్తే తన అదృష్టమని చెప్పుకొచ్చాడు.

ఇక నిఖిల్ మలియక్కల్ గోరింటాకు సీరియల్‌తో పాపులర్ అయ్యారు. ఊర్వశివో రాక్షసివో సీరియల్‌తో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. సీరియల్స్‌తో పాటు టీవీ షోలు, వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తున్నారు నిఖిల్. బిగ్ బాస్ సీజన్-8లో అడుగుపెట్టేవారిలో ఈ ఆరుగురు కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. వీరితో పాటు ఖయ్యూమ్ అలీ, సౌమ్యరావు, అంజలి పవన్, అభినవ్ నవీన్, అభిరామ్ వర్మ, సింగర్ సాకేత్ తదితరులు హౌస్‌లో కనిపించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, బిగ్ బాస్ తెలుగు సీజన్-8 రేపు రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం కానుంది. తెలుగులో విజయవంతంగా ఏడు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో..ఈసారి మరింత ప్రత్యేకంగా రంగంలోకి దిగుతోంది.

Latest Articles

రాహుల్ గాంధీపై ఎంపీ ఈటల రాజేందర్‌ తీవ్ర విమర్శలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. దేశ ప్రజల మీద విశ్వాసం లేని వ్యక్తి రాహుల్ అని ఫైర్ అయ్యారు. ఇక్కడ మాట్లాడే దమ్ము...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్