మీరు నోటాకి ఓటు వేసినా.. కారుకి ఓటు వేసినా.. నేనే గెలుస్తా- ఎంపీ అర్వింద్

స్వతంత్ర వెబ్ డెస్క్: మీరు నోటాకి ఓటు వేసినా నేనే గెలుస్తాను.. మీరు కారుకి ఓటు వేసినా నేనే గెలుస్తాను.. మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా నేనే గెలుస్తాను.. మీరు దేనికి ఓటు వేసినా ఓటు పడేది మాత్రం బీజేపీకే అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ముస్లిం మైనారిటీ ఏరియాలో ఎంపీ అర్వింద్ మీడియా సమావేశం జరిగింది. 75 ఏళ్లలో మైనార్టీలకు కాంగ్రెస్ కానీ ఇతర పార్టీల వల్ల లాభం చేకూరలేదు. బిజెపి మాత్రమే మైనార్టీలకు గుర్తింపు ఇచ్చిందన్నారు.

తాను పార్లమెంటు సమావేశాల్లో ఉన్నప్పుడు కావాలనే కేటీఆర్ నిజామాబాద్ లో పర్యటించారు. జిల్లాలో మైనార్టీల అభివృద్ధి కార్యక్రమాలలో కేంద్రం వాటా 60 శాతంపైగా ఉందని వెల్లడించారు. కేసీఆర్ అభద్రతా భావంతో ఉన్నారు.. అందుకే 2 చోట్ల పోటీకి సిద్ధం అయ్యారు.. కేసీఆర్ ఓడిపోవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల కెటిఆర్ ని బుడబుక్కలోడు అన్నాను.. అందుకు చింతిస్తున్న.. తనకు బుడబుక్కల అనే సమాజం ఉందని తెలియదు అన్నారు ఎంపీ అరవింద్.

Latest Articles

వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల

మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్