స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ హాట్‌స్టార్ క్రికెట్ ప్రేమికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆసియా కప్, వన్డే వరల్డ్‌కప్‌లను ఉచితంగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. క్రికెట్ ప్రేమికులు తమ మొబైల్‌లో ఉచితంగా మ్యాచ్‌లు చూడవచ్చని తెలిపింది. ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసింది. కాగా జియో సినిమా నుంచి హాట్‌స్టార్‌కు గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే జియో సినిమాలో క్రికెట్ మ్యాచ్‌లు ఫ్రీగా వీక్షిస్తున్న సంగతి తెలిసిందే.