Manchu Manoj |ఆ ఇద్దరి బాధ్యత నాదే.. ఆ విషయంలో మంచు మనోజ్ క్లారిటీ..

Manchu Manoj |సినీ నటుడు మంజు మనోజ్‌, భూమా మౌనిక రెడ్డి ఈనెల 3వ తేదీన వివాహ బంధంతో ఒకటయ్యారు. తమ్ముడు మనోజ్‌ పెళ్లి బాధ్యతలను పూర్తిగా తన భుజాలపై వేసుకుని అన్ని పనులు దగ్గరుండి చూసుకున్నారు మంచు లక్ష్మీ. ఫిల్మ్ నగర్‏లోని ఆమె స్వగృహంలో ఇరువురి కుటుంబసభ్యులు.. అతికొద్ది మంది సన్నిహితుల మధ్య వీరి వివాహం గ్రాండ్‌గా జరిగింది. మంచు మనోజ్‏కు.. మౌనికలకు ఇది రెండో వివాహం అనే విషయం తెలిసిందే. ఇదే సమయంలో మౌనికకు ధైరవ్ రెడ్డి అనే కుమారుడు కూడా ఉన్నాడు. పెళ్లి వేడుకలలో ధైరవ్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు. ఇక పెళ్లి తర్వాత మనోజ్ చేసిన ఆసక్తికర ఫోటో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. అందులో మౌనిక చేతులను తన చేతులోకి తీసుకున్నారు మనోజ్. వీరిద్దరి చేతులను ధైరవ్ తన చేతులతో పట్టుకున్నాడు. ఈ అందమైన ఫోటో షేర్ చేస్తూ.. శివుని ఆజ్ఞ అంటూ క్యాప్షన్ ఇచ్చారు మనోజ్. ఇక వీరిద్దరి బాధ్యత తనదనే అర్థం వచ్చేలా ఆ పోటోకు క్యాప్షన్‌ ఇచ్చారు.

గత కొద్ది రోజులుగా మంచు మనోజ్ ప్రేమ, పెళ్లి గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే తన పెళ్లి గురించి మనోజ్ ఎప్పుడూ అధికారికంగా చెప్పలేదు. అలాగే మంచు మనోజ్ మ్యారెజ్ గురించి మంచు కుటుంబసభ్యులు ముందుగా స్పందించలేదు. మార్చి 3న పెళ్లి రోజున మనోజ్ వెడ్స్ మౌనిక అంటూ క్యాప్షన్ ఇస్తూ మౌనిక ఫోటో షేర్ చేశారు మనోజ్.

Read Also:  వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్‌.. ఆ కీలక నేతకు మరోసారి సీబీఐ నోటీసులు

Follow us on:   Youtube   Instagram

Latest Articles

బెంగళూరులో గవర్నర్‌ కాన్వాయ్‌ని బ్లాక్‌ చేసిన వ్యక్తి.. రోడ్డుపై బైఠాయించి నిరసన

బెంగళూరులో ఓ వ్యక్తి గవర్నర్‌ కాన్వాయ్‌ను బ్లాక్‌ చేశాడు. గవర్నర్‌ వస్తున్నారని ట్రాఫిక్‌ నిలిపివేశారు పోలీసులు. గంటల తరబడి ట్రాఫిక్‌ నిలిపివేయడంతో ట్రాఫిక్‌లో నిలిచిపోయిన ఓ వ్యక్తి అసహనం వ్యక్తం చేశాడు. రోడ్డుపై...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్