Akshay Kumar |అక్షయ్ కుమార్ కు తప్పిన ప్రమాదం.. ఆ సినిమా షూటింగ్ లో గాయాలు..

Akshay Kumar  |బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌ కు ప్రమాదం తప్పింది. సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు అక్షయ్ కుమార్. ఈ బాలీవుడ్ నటుడు సినిమాల్లో అడుగు పెట్టినప్పటి నుంచి సినిమాల్లోని యాక్షన్ సన్నివేశాలను ఎటువంటి డూప్ సహాయం తీసుకోకుండా స్వయంగా చేస్తారు. వెండి తెరపై అడుగు పెట్టినప్పటి నుంచి ఎటువంటి రిస్క్ సన్నివేశమైనా స్వయంగా చేయడం అలవాటు. అయితే ఇలా యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. అక్షయ్ కుమార్ తాజా సినిమా ‘బడే మియాన్ చోటే మియాన్’ సెట్స్‌లో గాయపడినట్లు తెలుస్తోంది. అక్షయ్ కుమార్ తన సహా నటుడు టైగర్ ష్రాఫ్‌తో కలిసి ‘బడే మియాన్ చోటే మియాన్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ స్కాట్లాండ్‌లో జరుగుతోంది. సినిమా షూటింగ్ సమయంలో అక్షయ్.. టైగర్‌తో కలిసి యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఓ స్టంట్ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో అక్షయ్ గాయపడ్డాడు. అయితే పెద్దగా గాయాలు కాలేదని తెలుస్తోంది. గాయపడిన తర్వాత కూడా.. అక్షయ్ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడని సమాచారం.

అక్షయ్ కుమార్(Akshay Kumar) గాయపడటంతో కొంత సమయం షూటింగ్ ఆగిపోయింది. అయితే అక్షయ్ తన క్లోజప్‌తో మిగిలిన భాగాన్ని షూట్ చేసినట్లు సమాచారం. తన వలన మిగిలినవారు ఇబ్బంది పడకూడదని.. షూటింగ్ సమయం వృథా కాకుండా కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం.. షెడ్యూల్ ప్రకారం మరిన్ని సన్నివేశాలను చిత్రీకరించింది చిత్ర యూనిట్ . పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్లీ ఈ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించనున్నారు. అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

 Read Also:  ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభ వేడుకల ప్రత్యేకతలేంటో తెలుసా..

Follow us on:   Youtube   Instagram

Latest Articles

ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్