England: దారుణంగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్… 156 పరుగులకే ఆల్ అవుట్

స్వతంత్ర వెబ్ డెస్క్: భారత్ ఆతిథ్యమిస్తున్న వరల్డ్ కప్ లో డిఫెండింగ్ చాంప్ ఇంగ్లండ్ బ్యాటింగ్ నానాటికీ తీసికట్టు అన్నట్టుగా సాగుతోంది. ఓవైపు ఆఫ్ఘనిస్థాన్ వంటి చిన్న జట్లు సైతం టోర్నీ జరిగే కొద్దీ పుంజుకుంటుంటే… ఇంగ్లండ్ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. బ్యాటింగ్ వైఫల్యాలతో ఆ జట్టు స్థాయికి తగ్గట్టు ఆడలేకపోతోంది. ఇవాళ శ్రీలంక జట్టుతో పోరులో ఇంగ్లండ్ మరీ దారుణంగా బ్యాటింగ్ చేసింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 33.2 ఓవర్లలో 156 పరుగులకు కుప్పకూలింది. పిచ్ ఏమంత ప్రతికూలంగా లేనప్పటికీ, ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ క్రీజులో కుదురుకోలేకపోయారు. లంక బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేసి ఇంగ్లండ్ ను కట్టడి చేశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో బెన్ స్టోక్స్ సాధించిన 43 పరుగులే అత్యధికం. ఓపెనర్లు జానీ బెయిర్ స్టో 30, డేవిడ్ మలాన్ 28 పరుగులు చేశారు. జో రూట్ (3), కెప్టెన్ జోస్ బట్లర్ (8), లివింగ్ స్టన్ (1), మొయిన్ అలీ (15), క్రిస్ వోక్స్ (0) నిరాశపరిచారు. శ్రీలంక బౌలర్లలో, సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి వచ్చిన పేసర్ లహిరు కుమార 3 వికెట్లతో, ఏంజెలో మాథ్యూస్ 2 వికెట్లతో ఇంగ్లండ్ ను దెబ్బతీశారు. కసున్ రజిత 2, మహీశ్ తీక్షణ 1 వికెట్ తీశారు.

Latest Articles

బ్యాంకు లింకేజీ స్త్రీ నిధి ద్వారా మహిళా సంఘాలకు రూ. లక్ష కోట్లు రుణాలు ఇస్తాం-రేవంత్‌ రెడ్డి

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ప్రజా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. ఈ రోజు ఆర్థిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్