హీరో హీరోయిన్ ప్రేమలో ‘ఏందిరా ఈ పంచాయితీ’

నేటితరం ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా రూపొందుతున్న సినిమా ‘ఏందిరా ఈ పంచాయితీ’. ఈ సినిమాను ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మిస్తున్నారు. గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భరత్, విషికా లక్ష్మణ్‌లు ఈ చిత్రంతో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. రీసెంట్‌గా ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టైటిల్ లోగో అందరినీ ఆకట్టుకుంది. ఊర్లోని వాతావరణాన్ని, చిన్న గొడవలు, కులవృత్తులను తెలియజేసేలా కొన్ని సంకేతాలను వదిలారు. తాజాగా చిత్ర ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ చూస్తుంటే ‘ఏందిరా ఈ పంచాయితీ’ రూపంలో ఓ కంప్లీట్ విలేజ్ స్టోరీని తెరపైకి తీసుకొచ్చారని తెలుస్తోంది. ఊరి చివర సహజమైన వాతావరణంలో హీరో హీరోయిన్ ఓ గోడ మీద కూర్చొని ముచ్చటించుకుంటున్న సీన్ ఫస్ట్ లుక్‌గా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే హీరో హీరోయిన్ గాఢమైన ప్రేమలో అస్సలు సంబంధం లేని ఎన్నో పంచాయితీలు చోటు చేసుకుంటాయని.. ఈ పంచాయితీల చుట్టే ఈ కథ తిరుగుతుందని తెలుస్తోంది. పూర్తి పల్లెటూరు నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఒక మంచి ఫీల్ తెప్పిస్తుందని అర్థమవుతోంది.

ఈ సినిమాకు సతీష్ మాసం కెమెరామెన్‌గా, పీఆర్ (పెద్దపల్లి రోహిత్) సంగీత దర్శకుడిగా, జేపీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. వెంకట్ పాల్వాయి, ప్రియాంక ఎరుకల ఈ చిత్రానికి మాటలు అందించారు. కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, చిత్తూరు కుర్రాడు తేజ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్.

సాంకేతిక బృందం
బ్యానర్ : ప్రభాత్ క్రియేషన్స్
నిర్మాత : ప్రదీప్ కుమార్. ఎం
డైరెక్టర్ : గంగాధర. టి
కెమెరామెన్ : సతీష్‌ మాసం
సంగీతం : పీఆర్ (పెద్దపల్లి రోహిత్)
మాటలు : వెంకట్ పాల్వాయి, ప్రియాంక ఎరుకల
ఎడిటర్ : జేపీ
డీఐ : పీవీబీ భూషణ్
పీఆర్వో : సాయి సతీష్

Latest Articles

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిర్ణయం వెనుక బీజేపీ బహుముఖ వ్యూహం

కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఆకస్మిక రాజీనామా దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. జాతీయ స్థాయిలో జరిగిన వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలపై విద్యార్థి లోకం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్