30.2 C
Hyderabad
Sunday, May 12, 2024
spot_img

లోక్‌సభ ఎన్నికల వేళ సరికొత్త రగడ …. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం

సార్వత్రిక ఎన్నికల వేళ టార్గెట్ 400 అంటోంది బీజేపీ…! పదేళ్ల మోసం.. వందేళ్ల విధ్వంసం అంటోంది కాంగ్రెస్. అంతేకాదు రిజర్వేషన్ల రద్దుతోపాటు రాజ్యాంగం మార్చేందుకు కమలం కుట్ర చేస్తోందని ఆరోపిస్తోంది. ఎన్నికల వేళ అభివృద్ధి, సంక్షేమం గురించి చర్చించాల్సిన చోట ఎందుకీ అంశాలపై చర్చ సాగుతోంది ? అసలు తెరవెనుక ఏం జరుగుతోంది ? ఇప్పుడు దీనిపైనే అంతటా చర్చ జరుగుతోంది.

లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి సత్తాచాటి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది బీజేపీ. సొంతంగానే 370 సీట్లు టార్గెట్‌గా పెట్టుకున్న కమలనాథులు ఎన్డీఏ కూటమి పరంగా చూస్తే, 400 స్థానాలు సాధించాలని పక్కా వ్యూహంతో ముందుకెళు తోంది. ఆ మేరకు ప్రధాని మోడీ నుంచి మొదలుకొని అమిత్ షా, నడ్డా, రాజ్‌నాథ్ సహా అగ్రనేతలంతా దేశ వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తూ టార్గెట్ 400 సాధించే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే రిజర్వేషన్లపై ప్రధానంగా రగడ సాగుతోంది. కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఇటీవలె విమర్శలు గుప్పించారు ప్రధాని మోడీ, అమిత్ షా సహా మరికొందరు కమలం నేతలు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. దేశ సంపదను ముస్లింలకు దోచి పెడుతుందంటూ ఆరోపించారు ప్రధాని. ఇక, మరికొం దరు జాతీయ నేతలు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ మైనారిటీలకు ఉన్న రిజర్వేషన్లు తొలగిస్తామంటూ చెప్పుకొస్తు న్నారు. నేషనల్ లీడర్లే కాదు. తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలదీ ఇదే మాట.దీంతో.. ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది.

బీజేపీ నేతల కామెంట్లే కాదు. వారు సాధించాలనుకున్న టార్గెట్‌పై విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తు న్నాయి. 2/3వ వంతు మెజార్టీ సాధించాలని కమలనాథులు భావించడం వెనుకు కుట్ర ఉందని ఆరోపిస్తున్నాయి. ప్రధానంగా రిజర్వే షన్ల రద్దుకోసం బీజేపీ ఈ స్కెచ్ వేసిందని ఆరోపిస్తోంది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు.. అధికారంలోకి వచ్చాక కులగణన చేసి ఆయా సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లు ఇచ్చేందుకు హస్తం పార్టీ ప్రయత్నం చేస్తామని చెబుతుంటే.. బీజేపీ ఎందుకు ఉలిక్కిపడుతోందని విమర్శిస్తోంది. అంతేకాదు.. 2025 నాటికి ఆర్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భవించి వందేళ్లవుతుందని. ఆ సందర్భంగా మైనార్టీ రిజర్వేషన్లు రద్దుచేసి దేశం మొత్తాన్ని హిందూయిజం వైపు నడిపించేందుకు కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ సహా ఇతర నేతలు. దీంతో ఈ ఎన్నికలు రిజర్వేషన్లు కావాలా.. వద్దా అన్నదానికి మధ్యే జరుగుతున్నాయంటూ హాట్ కామెంట్లు చేశారు సీఎం రేవంత్.

  కేవలం రిజర్వేషన్ల అంశమే కాదు. మరికొన్నింటిపైనా ఈసారి తీవ్ర చర్చ సాగుతోంది. అందులో ఒకటి రాజ్యాంగాన్ని మార్చివేసే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు. నిజానికి ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగంలోని కొన్ని కీలక అంశాలపై సవరణలు చేయాలంటే లోక్ సభలో సగం కంటే ఎక్కువ సభ్యులు హాజరుకావడంతోపాటు హాజరైన సభ్యుల్లో మూడింట రెండో వంతు మంది ఆ తీర్మానాలను ఆమోదించాల్సి ఉంటుంది. అంటే మొత్తం ఓట్లు 272 కంటే ఎక్కువగా ఉండాలి. ఒకవేళ ఆ తీర్మాన సభకు మొత్తం 545 మంది సభ్యులు హాజరైతే అందులో మూడవ వంతు అంటే 363 లేదా అంతకంటే ఎక్కువ మంది మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఒంటరిగా 370 ఎన్డీఏ కూటమిగా 400 సీట్లు సాధించాలన్న లక్ష్యం పెట్టుకుందని ఆరోపిస్తున్నాయి విపక్షాలు. అధికారపక్షం ఆరోపణలు, విపక్షాల ప్రత్యారోపణలు ఎలా ఉన్నా, యావత్ భారతం తీర్పు ఎలా ఉండబోతోంది? బీజేపీ అనుకున్న టార్గెట్ సాధ్యమవుతుందా? విపక్షాలు పైచేయి సాధిస్తాయా తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. 

Latest Articles

పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ సెటైర్లు

ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై సెటైర్లు వేశారు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన కాంగ్రెస్‌, తృణ మూల్‌ కాంగ్రెస్‌ పార్టీలపై విరుచుకుపడ్డారు. సందేశ్‌ఖాలీలో టీఎంసీ నాయకులు మహిళ లపై లైంగిక వేధింపులకు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్