33.2 C
Hyderabad
Tuesday, May 5, 2026
spot_img

అప్పటినుంచే గొర్రెల పంపిణీ.. ప్రారంభించనున్న తలసాని

స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 9 నుండి గొర్రెల పంపిణీ ప్రారంభం కానుంది. నకిరేకల్ లో గొర్రెల పంపిణీని ప్రారంభించనున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గొర్రెల యూనిట్ ల పంపిణీ, ఫిష్ ఫుడ్ ఫెస్టివల్, దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. గొర్రెల అభివృద్ధి పథకం, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాల బ్రోచర్ లను స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆధార్ సిన్హా తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. దశాబ్ది ఉత్సవాలలో ప్రభుత్వ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. గొర్రెల యూనిట్ ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో 8వ తేదీన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను ప్రారంభించుకుంటున్నట్లు తెలిపారు.

Latest Articles

బెంగాల్‌లో బీజేపీ చారిత్రాత్మక విజయం.. నెక్ట్స్‌ సీఎం ఎవరు?

పశ్చిమ బెంగాల్‌లో నూతన అధ్యాయం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్‌ ప్రజలు బీజేపీకి చారిత్రాత్మక విజయం అందించారు. దశాబ్దాల కాలంగా కమ్యూనిస్టులు, ఆపై టీఎంసీకి కంచుకోటగా ఉన్న బెంగాల్‌ను కైవసం చేసుకోవడం ద్వారా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్