పవన్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఫిక్స్?

  ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కేబినెట్ సంగతేంటి టీడీపీ నుంచి ఎవరెవరికి బెర్త్‌లు దక్కబోతున్నాయనే చర్చ జరుగు తోంది. అలాగే జనసేన పార్టీ, బీజేపీల నుంచి ఎవరు రేసులో ఉన్నారనే ఉత్కంఠ కొనసాగుతోది. అలాగే పవన్ కళ్యాణ్ తన పదవిపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం మొదలైంది.

  అంతేకాదు సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబోతున్నారనే టాక్ నడుస్తోంది. ఈ నెల 12న పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు చర్చ జరుగు తోంది. కొందరు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాబోతు న్నారని ప్రమాణ స్వీకారానికి తాము కూడా వెళతామని కొందరు జనసైనికులు జోరుగా చర్చించుకుంటు న్నారు. జనసేనకు మూడు మంత్రి పదవులు కేటాయించారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగు తోంది.

Latest Articles

జనగణనలో ఓబీసీ కాలమ్ లేకపోవడంపై వివాదం

జనగణనలో కులగణన అంశం ఇప్పుడు అధికార భారతీయ జనతా పార్టీ మెడకు గట్టిగా చుట్టుకుంటోంది. దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం కోసం వెనుకబడిన వర్గాల లెక్కలు తేల్చాలన్న డిమాండ్ కొన్నేళ్లుగా బలంగా వినిపిస్తోంది. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్