ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మళ్లీ తీహార్ జైలుకి వెళ్లనున్నారు. నిన్నటితో సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో ఇవాళ తీహార్ జైలులో లొంగిపోనున్నారు. లిక్కర్ కేసులో మార్చి 21న అరెస్టైన కేజ్రీవాల్‌కు 49రోజుల జైలుజీవితం తర్వాత మే 10న బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి వీలుగా మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే, బెయిల్ ఇచ్చిన రోజే జూన్ రెండున మళ్లీ సరెండర్ కావాలని ఆదేశించింది. ఎన్నికలు ముగిశాయి. కేజ్రీవాల్‌కు సుప్రీం ఇచ్చిన గడువూ ముగిసింది. దీంతో ఇవాళ తిరిగి జైలు అధికారుల ముందు సరెండర్ అవుతున్నారు.ఆరోగ్య పరీక్షలు చేయించుకునేందుకు మరో వారం రోజులు బెయిల్ గడువు పెంచాలని కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు విముఖత చూపించింది. దీంతో ఆయన మధ్యంతర, సాధారణ బెయిల్ ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. కేజ్రీవాల్ పిటిషన్లపై ఉత్తర్వులను జూన్ 5కి వాయిదా వేసింది సీబీఐ ప్రత్యేక కోర్టు.
మళ్లీ తీహార్ జైలుకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
0
203
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


