సూపర్ బ్లాక్ బస్టర్ టాక్‌తో విజయవంతంగా డెడ్ పుల్ అండ్ వాల్వరిన్ తెలుగునాట థియేటర్లలో సందడి చేస్తోంది. అత్యంత భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా జూలై 26న విడుదలైన ఈ సినిమాను మార్వెల్ స్టూడియోస్ నిర్మించింది. రయన్ రెనాల్డ్స్, హుయ్ జాక్ మెయిన్ ముఖ్య పాత్రలుగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ బాక్స్‌ఫీస్‌ని షేక్ చేస్తుంది. దాదాపుగా మూడు రోజుల్లో 3670 కోట్లు కలెక్ట్ చేసి కాసుల వరద సృష్టించింది. ఇండియాలో కూడా డెడ్ పుల్ అండ్ వాల్విరిన్ కలెక్షన్ల హవా కొనసాగుతుంది. మరీ ముఖ్యంగా తెలుగులో ఈ సినిమాకు మార్వెల్ మూవీ అభిమానుల ఆదరణ దక్కింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లో ఉన్న టైమ్లీ డైలాగులు అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. డెడ్ పుల్ పాత్రదారు రయన్ రెనాల్డ్స్ పలికిన ప్రతి సంభాషణకి సంబంధించిన తెలుగు డబ్బింగ్ ఆద్యంతం హాస్యాన్ని పండించింది. దీంతో ఈ సినిమాకు విడుదలైన రోజు నుంచి తెలుగులో విశేషాదరణ లభిస్తుంది.
3 రోజుల్లో రూ. 3670 కోట్లు కలెక్ట్ చేసిన ‘డెడ్‌పుల్ అండ్ వాల్వరిన్’
0
375
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


