తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకం కేసులో ఏసీబీ ఇద్దరిని కస్టడీలోకి తీసుకోనుంది. పశుసంవర్ధక మాజీ సీఈవో రామచందర్ నాయక్, మాజీ ఓఎస్డీ కల్యాణ్ కుమార్‌ను ఏసీబీ అధికారులు విచారించ నున్నారు. వీరిద్దిరికి ఏసీబీ కోర్టు 3 రోజుల కస్టడీకి అనుమతించింది. ఈక్రమంలో అధికారులు వారిని ఇవాళ చంచల్‌గూడ జైలు నుంచి బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించి విచారిం చను న్నారు. వీరిద్దరూ ఇచ్చే సమాచారం ఆధారంగా మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈ కేసులో 700కోట్ల విలువైన అక్రమాలకు సంబంధించి ఆధారాలు గుర్తించినట్లు సమాచారం. బినామీ పేర్లతో బిల్లులను విత్‌డ్రా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఇప్పటికే సుమారు పది మంది నిందితులను గుర్తించారు.
గొర్రెల పంపిణీ పథకంలో అవినీతి విచారణ
0
224
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


