36.2 C
Hyderabad
Friday, May 15, 2026
spot_img

కేజ్రీవాల్‌ని చంపేందుకు కుట్ర పన్నారు – సునీత కేజ్రీవాల్

    ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ని చంపేందుకు కుట్ర పన్నారని ఆయన భార్య సునీత కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తీహార్ జైల్లో తన భర్తను చంపడానికి బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. కేజ్రీవాల్‌కు ఇచ్చే ప్రతీ భోజనాన్ని అధికారులు పర్యవేక్షిస్తున్నారన్నారు. విపక్ష కూటమి ‘ఇండియా ఆధ్వర్యంలో రాంచీలో నిర్వహించిన బహిరంగ సభలో కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వానికి వ్యతిరేకంగా విపక్షాల కూటమి పోరాడుతోందన్నారు. కేజ్రీవాల్‌ తినే ప్రతి ముద్దను అధికారులు పర్యవేక్షిస్తున్నారని ఇది చాలా సిగ్గు చేటన్నారు సునీతా కేజ్రీవాల్‌. షుగర్ పేషెంట్‌ గా ఉండీ 12 ఏళ్లుగా ఇన్సులిన్ తీసుకుంటున్నా, తీహార్ జైలు అధికారులు ఇన్సులిన్ తిరస్కరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్‌ను కేంద్ర చంపాలనుకుంటోందని సునీతా కేజ్రీవాల్‌ ఆరోపించారు.

    ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆప్ నేతలు కేజ్రీవాల్‌ ప్రాణాలకు ప్రమాదం ఉందని, చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. లిక్కర్ స్కాములో కీలక పాత్రధారి సీఎం కేజ్రీవాల్ అని ఈడీ ఆరోపిస్తోంది. మరోవైపు ఆయన మెడికల్ సమస్యలను చూపించి బెయిల్ పొందేందుకు షుగర్ వ్యాధి ఉన్నప్పటికీ స్వీట్లు, మామిడిపండ్లు, ఆలూ పూరీ వంటివి తింటు న్నాడని ఈడీ ఇటీవల కోర్టుకు వెల్లడించింది.

Latest Articles

కేసీ వేణుగోపాల్ బదులు సతీషన్‌కే ఎందుకు పట్టం కట్టారు?

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత.. ముఖ్యమంత్రి ఎవరనే దానిపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. పది రోజుల పాటు సాగిన తీవ్ర మల్లగుల్లాల తర్వాత, ప్రతిపక్ష నేతగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్