35.2 C
Hyderabad
Friday, May 8, 2026
spot_img

Vijayawada: విరిగిపడ్డ కొండచరియలు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్డు మూసివేత

స్వతంత్ర వెబ్ డెస్క్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై అల్పపీడనం కొనసాగుతుండడంతో ఏపీలోని పలు జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ లో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఇంద్రకీలాద్రిపై కొండరాళ్లు బుధవారం జారి ఘాట్‌రోడ్‌ మీద పడ్డాయి . ముందు జాగ్రత్త చర్యగా ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డును అధికారులు మూసివేశారు.

ఉత్తర కోస్తాంధ్ర ఒడిశా తీరాన్ని ఆనుకుని బలమైన అల్పపీడనం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలియజేసింది. అల్పపీడనానికి అనుబంధంగా రుతుపవన ద్రోణి, ఉపరితల అవర్తనం ఉందని వెల్లడించింది. దీని వల్ల కోస్తాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు, రాయలసీమలో విస్తారంగా వర్షాలు పడే అవకాశముందని ప్రకటించింది. రేపటి నుంచి కోస్తాంధ్ర జిల్లాలో వర్షం పడే అవకాశముందని స్పష్టం చేసింది. అల్లూరి జిల్లా రంపచోడవరం మన్యంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మన్యం జిల్లాలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దేవీపట్నం మండలం సుక్కరాతి గండి వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. భూపతిపాలెం జలాశయం 5 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు.

Latest Articles

తెలుగు సినిమాల పైనే ఫోకస్ పెట్టిన కార్తి..

కోలీవుడ్ స్టార్ కార్తి.. తమిళ ప్రేక్షకులనే కాదు.. తెలుగు ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుని.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. ఊపిరి సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జునతో కలిసి నటించి.. తెలుగు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్