ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ పై ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీసులు ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులను నమోదు చేశారు. పట్టణంలో ఏర్పాటు చేసిన శ్రీరామ నవమి ఫ్లెక్సీలపై శ్రీరాముడి చిత్రంతో పాటు ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఫొటోను ఎన్నికల సంఘం అనుమతి లేకుండా ముద్రించారని VST అధికారులు ఫిర్యాదు చేశారు. వన్ టౌన్ పోలీసు స్టేషన్లో ఎమ్మెల్యే శంకర్ పై కేసు నమోదైంది. కాగా శ్రీరామ నవమి రోజు శోభాయాత్రలో ఎమ్మెల్యే శంకర్, బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ పాల్గొని నినాదాలు చేసి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని VST అధికారులు ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు చేసినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.
ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ అభ్యర్థి నగేష్ పై కోడ్ ఉల్లంఘన కేసులు
0
356
Previous article
Next article
Latest Articles
జనగణనలో ఓబీసీ కాలమ్ లేకపోవడంపై వివాదం
జనగణనలో కులగణన అంశం ఇప్పుడు అధికార భారతీయ జనతా పార్టీ మెడకు గట్టిగా చుట్టుకుంటోంది. దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం కోసం వెనుకబడిన వర్గాల లెక్కలు తేల్చాలన్న డిమాండ్ కొన్నేళ్లుగా బలంగా వినిపిస్తోంది. ఈ...
- Advertisement -
- Advertisement -


