ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దీక్ష చేసేందుకు వచ్చిన కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు అశోక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తొమ్మిది రోజులుగా గాంధీ హాస్పిటల్‌లో ఓయూ విద్యార్థి మోతిలాల్ ఆమరణ నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. మోతిలాల్ మంగళవారం దీక్ష విరమించారు. నిరుద్యోగుల పక్షాన ఆమరణ నిరాహారదీక్ష కొనసాగిస్తా అంటూ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు అశోక్ ముందుకు వచ్చా రు. దీక్ష చేయడానికి ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్దకు అశోక్ చేరుకున్నారు. అయితే.. దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు అశోక్‌ని అరెస్టు చేసి, చైతన్యపురి పోలీస్ స్టేషన్‌కి తరలించారు.