నీట్ ఎగ్జామ్ రద్దుపై సీఎం రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న నీట్ యూజీ పరీక్షరద్దుపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పేపర్ రద్దుపై అసహనం వ్యక్తం చేసిన రేవంత్‌రెడ్డి.. లక్షలాది మంది విద్యార్థులు షాక్‌కు లోనయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ ఎగ్జామ్‌ రద్దు ఘటనపై పారదర్శకంగా విచారణ జరిపించాలన్న ఆయన.. కేంద్రం నిర్ణయంతో దేశవ్యాప్తంగా 22 లక్షల 79 వేల మంది విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని తెలిపారు.

పరీక్షల విశ్వసనీయతను కేంద్రం కాపాడాలన్న రేవంత్ రెడ్డి..మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్టూడెంట్స్ మళ్లీ ఇబ్బందులు పడకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని ఎక్స్ వేధకగా ఆయన సూచించారు. పోటీ పరీక్షలు అవకాశాల వేదికగా ఉండాలే తప్ప విద్యార్థుల జీవితాలను నాశనం చేసేలా మారకూడదని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు, పేపర్ లీక్ వంటి వాటిల్లో బీజేపీ, బీఆర్ఎస్‌ల మధ్య పోలిక ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

Latest Articles

వరంగల్ మేయర్‌ పీఠంపై బండి సంజయ్‌ ఫోకస్‌.. జీహెచ్‌ఎంసీలో ప్రచారం లేనట్టేనా?

హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్