Ambedkar Statue |భాగ్యనగరం నడి బొడ్డున 125 అడుగుల భారీ విగ్రహం.. రేపే ఆవిష్కరణ

Ambedkar Statue |దేశం గర్వించదగ్గ వ్యక్తి, మహాజ్ఞాని, రాజ్యాంగ రూపకర్త, జాతి గర్వించదగ్గ నేత డా. బాబాసాహెబ్ అంబేడ్కర్. ఈయన చేసిన కృషి, త్యాగానికి స్ఫూర్తిగా భాగ్యనగరం నడి బొడ్డున 125 అడుగుల అంబేడ్కర్ భారీ విగ్రహం ఆవిష్కృతం అవుతోంది. అంబేడ్కర్ జయంతి సందర్బంగా ఏప్రిల్ 14వ తేదీన హుస్సేన్ సాగర్ తీరాన ఈ భారీ విగ్రహం దర్శనమివ్వబోతుంది. రూ.146.50 కోట్లు వ్యయంతో 11.4 ఎకరాల విస్తీర్ణంలో ‘అంబేడ్కర్ స్మృతివనం’ భవనంపై 125 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం బరువు 450 టన్నులు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మేధావులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా అంబేడ్కర్ మునిమనవడు ప్రకాశ్ అంబేడ్కర్(Prakash Ambedkar)​ రానున్నారు.

జాతి సగౌరవంగా చెప్పుకోగలిగే అంబేడ్కర్ విగ్రహాన్ని బౌద్ధ భిక్షువుల ప్రార్థనల మధ్య ఆవిష్కరిస్తారు. విగ్రహావిష్కరణ అనంతరం అక్కడే బహిరంగ సభను కూడా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిపే ఈ సభకు అన్ని జిల్లాల నుంచి ప్రజలను తరలిస్తున్నారు. విగ్రహావిష్కరణ అనంతరం భారీ క్రేన్ సాయంతో అంబేడ్కర్ విగ్రహానికి(Ambedkar Statue) పూలమాల వేయడమే కాకుండా.. హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించనున్నారు. ఈ అపూర్వగా ఘట్టం తిలకించడానికి ఎందరో ప్రజలు అక్కడికి చేరుకోనున్నారు.

సీఎం కేసీఆర్(CM KCR) దీక్షా పట్టుదలతో మొదలుపెట్టిన ఈ అద్భుత ఘట్టం… రేపు ఆవిష్కరణ కానుంది. దీనిపై హర్షం వ్యక్తం చేసిన కేసీఆర్… ప్రసన్నవదనంతో నిల్చొని ఉన్న అంబేద్కరుడు ఓ తాత్విక జ్జానిగా అలరిస్తున్నారని తెలిపారు. ఈ విగ్రహాన్ని పూర్తి స్వదేశీ పరిజ్జానంతోనే రూపొందించడం తనకు అత్యంత సంతృప్తిని కలిగించిందని సీఎం పేర్కొన్నారు. అంబేడ్కర్ ఆశయాలను నెరవేర్చే దిశగా… ప్రజా ప్రతినిధులు, యావత్ ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలన్న సంకల్పంతోనే సెక్రటరియేట్ కు కూడా ఆయన పేరే పెట్టమన్నారు.

Read Also: కవిత-సుకేశ్ వాట్సాప్ చాట్ పై ఈడీకి రఘునందన్ ఫిర్యాదు

Follow us on:  YoutubeKooGoogle News

Latest Articles

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు షాక్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. మంగళవారం తలపెట్టిన జనసేన సభకు అనుమతి నిరాకరించారు. రేపు రాష్ట్రంలో పార్టీ నవ నిర్మాణ సంకల్ప సభ ప్లాన్ చేసుకుంది...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్