Telangana: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంతో సంబంధం లేకపోతే మంత్రి కేటీఆర్ ఎందుకు స్పందించారని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. రాష్ట్రంలో ఏ కంప్యూటర్ ద్వారా సమాచారం లీకైనా… దానికి కేటీఆర్ నైతిక బాధ్యత వహించాలని అన్నారు. పేపర్ లీకేజీ ఘటన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన చేస్తున్నారని అన్నారు. తండ్రి మాదిరి.. కుమారుడు జర్నలిస్టులను తిట్టడం అలవాటుగా మారిందన్నారు. పేపర్ లీకేజీపై సంబంధం లేకుంటే విద్యాశాఖ మంత్రి మాట్లాడకుండా కేటీఆర్ మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. రాజు తర్వాత యువరాజుగా ఫీల్ అవుతున్నాడు కాబట్టే.. కేటీఆర్‌ను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ ఏడాది ఎన్నికలు వస్తున్నందునే కేసీఆర్‌కు రైతులపై ప్రేమ పొంగుకొస్తుందని అన్నారు. రాష్ట్రంలో కౌలు రైతుల సంఖ్య ఎంతో వ్యవసాయ శాఖ కమిషనర్ శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన: రఘునందన్ రావు
0
320
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


