రేపు కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన

      సీఎం జగన్ రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. పులివెందులలో పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుంటారు. ముందుగా డాక్టర్‌ వైఎస్సార్‌ గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత బనాన ఇంటిగ్రేటెడ్‌ ప్యాక్‌ హౌస్‌ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్‌ వైఎస్సార్‌ మినీ సెక్రటేరియట్‌ కాంప్లెక్స్‌కు చేరుకుని ప్రారంభిస్తారు.అనంతరం డాక్టర్‌ వైఎస్సార్‌ జంక్షన్‌కు వెళ్లి ప్రారంభిస్తారు. అక్కడే సెంట్రల్‌ బౌల్‌ వార్డ్‌ ప్రారంభించిన తర్వాత వైఎస్‌ జయమ్మ షాపింగ్‌ కాంప్లెక్స్‌కు చేరుకుని ప్రారంభిస్తారు. అనంతరం డాక్టర్‌ వైఎస్సార్‌ ఉలిమెల్ల లేక్‌ ఫ్రంట్‌ వద్దకు చేరుకుని ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆదిత్యా బిర్లా యూనిట్‌కు చేరుకుని ఫేజ్‌–1 ప్రారంభోత్సవం లో సీఎం పాల్గొంటారు. మధ్యాహ్నం ఇడుపులపాయకు వెళ్లి వైఎస్సార్‌ మెమోరియల్‌ పార్కు ప్రారంభోత్స వంలో పాల్గొంటారు. అనంతరం వైఎస్సార్‌ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లికి చేరుకుంటారు.

Latest Articles

కవితకు ఈసీ నుంచి అడ్డంకులు.. పార్టీ పేరు మారుస్తారా..!

తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్తున్న కల్వకుంట్ల కవితకు ఎన్నికల సంఘం నుంచి అడ్డంకులు తప్పడం లేదు. తాజాగా కవిత కొత్త పార్టీ పేరు అంశంలో ప్రత్యామ్నాయ పేర్లను ఇవ్వాలని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్