ఒబెరాయ్ హోటళ్లకు శంఖుస్థాపన చేసిన సీఎం..

స్వతంత్ర వెబ్ డెస్క్: సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండోరోజు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆదివారం ఉదయం గండికోటకు చేరుకున్న జగన్.. ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. విశాఖ, తిరుపతి ఒబెరాయ్ హోటల్స్ కు వర్చువల్ గా సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడి వ్యూ పాయింట్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఒబెరాయ్ హోటల్స్ ఎండీ విక్రమ్ సింగ్ ఒబెరాయ్, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు ఆర్కే రోజా, ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. ఒబెరాయ్ గ్రూప్ ఏపీలోని మూడు ప్రాంతాల్లో సెవెన్ స్టార్ హోటల్స్ ను నిర్మించనుంది. గండికోట, తిరుపతి, విశాఖపట్నంలో సెవెన్ స్టార్స్ హోటళ్ల నిర్మాణం జరగనుంది.

ఈ పర్యటనలో భాగంగా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుట్టనున్నారు. వైఎస్సార్ కడప జిల్లా గండికోటతో పాటు విశాఖపట్నం, తిరుపతిలో ఒబెరాయ్ సంస్థ సెవెన్ స్టార్ హోటళ్లను నిర్మిస్తోంది. ఈ హోటళ్ల నిర్మాణ పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. అనంతరం గండికోటలో వ్యూ పాయింట్ ను పరిశీలించిన ముఖ్యమంత్రి.. అక్కడి నుంచి పులివెందులకు బయలుదేరి వెళ్లారు. పులివెందులలో నూతనంగా నిర్మించిన మున్సిపల్ కార్యాలయం ప్రారంభోత్సవం చేస్తారు.

పులివెందులలో నూతనంగా నిర్మించిన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని సీఎం ప్రారంభించనున్నారు. పులివెందుల రాణితోపు చేరుకుని నగరవనాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి గరండాల రివర్ ఫ్రంట్ కు చేరుకుని గరండాల కెనాల్ డెవలప్ మెంట్ ఫేజ్ 1 పనులను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అనంతరం పులివెందులలో నిర్మించిన స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను, ఏపీ క్లార్ లో ఏర్పాటు చేసిన న్యూటెక్ బయో సైన్సెస్ ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు పులివెందులలో వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమీని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవాల కార్యక్రమాలు ముగిసిన అనంతరం జగన్ ఇడుపులపాయకు చేరుకుంటారు.

Latest Articles

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి

         ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా  తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్‌ చేసి దాడికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్