26.2 C
Hyderabad
Sunday, November 3, 2024
spot_img

చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి కోరుతూ సీఐడీ పిటిషన్

స్వతంత్ర వెబ్ డెస్క్: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడి కస్టడీని కోరుతూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు రాబట్టేందుకు తమ కస్టడీకి ఐదు రోజులు ఇవ్వాలని కోరింది. అయితే ఈ పిటిషన్‌పై చంద్రబాబు తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. తాము రేపు కౌంటర్ దాఖలు చేస్తామని న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో ఏసీబీ న్యాయస్థానం… పోలీస్ కస్టడీ పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది.

మరోవైపు చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్‌పై తీర్పును ఈ రోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు కోర్టు వెలువరించనుంది. హౌస్ రిమాండ్‌పై ఏసీబీ కోర్టు తీర్పు తర్వాతే.. హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు భావిస్తున్నారు. హౌస్ రిమాండ్ తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తే వెంటనే బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు పత్రాలు సిద్ధం చేశారు.

Latest Articles

స్వయం డిజైనర్ స్టూడియోను ప్రారంభించిన ప్రణీత

స్వయం డిజైనర్ స్టూడియో పేరుతో హైదరాబాదులో సరికొత్త డిజైనర్ స్టూడియో అందుబాటులోకి వచ్చింది. యమునా బధిత ఏర్పాటు చేసిన ఈ ఫ్లాగ్ షిప్ స్టోర్ ను ప్రముఖ సినీనటి ప్రణీత సుభాష్ ఆవిష్కరించారు. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్