చిరంజీవి లోపల ఒకటి బయట మరొకటి

చిరంజీవి… పైకి ఓ మాదిరిగా కనిపించినా… లోపల మాత్రం ఆయనలో మరో మనిషి దాగుంటాడనిపిస్తుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో గొప్పలు చెప్పుకుంటూ ఆయనలోని మరో కోణాన్ని ఆవిష్కరించేస్తారు చిరంజీవి. పుట్టుకతో వచ్చేబుద్దులు పుడకలతో గానీ పోవు అన్నట్లు.. లోపల ఒకటి ఉంటే బయటకు నటించడం చాలా కష్టమే..! ఎప్పుడో ఒకసారి లోపలున్నోడు బయటపడిపోతాడు. ముసుగేసుకున్నోడు దొరికిపోతాడన్నట్లు..చిరంజీవి కూడా ఏదో చెప్పబోయి మరేదే చెబుతూ.. 40 ఏళ్లుకు పైగా తాను కాపాడుకున్న హుందా తనాన్ని తానే పాడుచేసుకుంటున్నారు. 70 ఏళ్ల వయస్సులో పదిమందికి చెప్పాల్సింది పోయి.. పది మంది నవ్వుకునేలా మాట్లాడుతున్నారు చిరంజీవి.

చిరంజీవి.. దాదాపు 50 ఏళ్ల సినీ ప్రస్తానం. ఈ సుదీర్ఘ సినీ ప్రస్తానంలో అనేక విజయాలను చూశారు చిరంజీవి. ఈ క్రమంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. సినిమాల కోసం ఆయన కష్టపడిన తీరే.. ఆయన్ను ప్రత్యేకంగా నిలబెట్టింది. 70 ఏళ్ల వయస్సులో ఆయన ఆరోగ్య రిత్యా తీసుకునే జాగ్రత్తలు కూడా పలువురు ఆదర్శంగా తీసుకుంటారు. అయితే చిరంజీవి రాజకీయ జీవితం ఆయన్ను అనేక వివాదాల్లో నిలబెట్టింది. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా చిరంజీవి ఉంటున్నా.. వివాదాలకు మాత్రం ఆయన చాలా దగ్గరగా ఉంటున్నారు. రాజకీయాలతో సంబంధం లేదంటూనే పలువురు రాజకీయ నాయకులను కలుస్తున్నారు. ఆయా వేదికలపై ఎవ్వరూ అడక్కపోయినా.. సందర్భం కాకపోయినా రాజకీయాలను ప్రస్తావిస్తూ వివాదాలను అంటించుకుంటున్నారు.

చిరంజీవికి సహజంగానే తొత్తరపాటు ఎక్కువ అనే ప్రచారం సినీ పరిశ్రమతో పాటు రాజకీయాల్లో ఎక్కుగా జరుగుతుంటుంది. ఈ ప్రచారానికి పెద్దగా కారణాలను వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఆయన మాటలు, చేతలను గమనిస్తే.. ఆ విషయం ఇట్టే అర్థమైపోతుంది. ఎక్కడ ఏం మాట్లాడాలో కాదు.. ఎలా మాట్లాడాలో కూడా చిరంజీవికి తెలియదన్న విషయం అనేక సార్లు తేటతెల్లమైంది. ఏ వేదికపై ఏ అంశాన్ని ప్రస్తావించాలన్న ఆలోచన కూడా చిరంజీవికి ఉండదని… తేలిపోయింది. చిన్న చిన్న విషయాలను కూడా ఎలా హ్యాండిల్ చేయాలో చిరంజీవికి తెలియడం లేదు.

రాజకీయాలను వదిలి చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి తన హుందాతనాన్ని క్రమంగా కోల్పోతున్నారు. ఒకప్పుడు చిరంజీవి సినిమాలంటే ఆది ఓ పండగ రోజులా ఉండేది. ఇప్పుడు చిరంజీవి కాదు కదా.. ఆయన కొడుకు రామ్ చరణ్ తో కలిసి సినిమా తీసినా.. బాగుంటేనే సినిమాకు ప్రేక్షకులు వస్తున్నారే గానీ.. బాగోలేకపోతే ఆ వైపు కూడా చూడటం మానేశారు ప్రేక్షకులు. అయితే ఆ విషయాన్ని మరిచిన చిరంజీవి.. తనకు ఎన్నేళ్లు వచ్చాయో గుర్తులేని చిరంజీవి… ఏదేదో మాట్లాడేస్తూ విమర్శల పాలవుతున్నారు. ఇటు ఇండస్ట్రీ గురించి.. అటు రాజకీయాల గురించి.. మరో వైపు తన కుటుంబం గురించి ఆయనే మాట్లాడుతూ నవ్వుల పాలవుతున్నారు.

తాను ఇండస్ట్రీ పెద్దను కాదు.. అని చెప్పుకుంటారు చిరంజీవి. కానీ ఏదైన వేదికపై ఎవరైనా… ఇండస్ట్రీ పెద్దదిక్కు చిరంజీవి గారు అనగానే ఆయనలో ఎక్కడలేని ఆనందం పొంగుకొస్తుంటుంది. ఇక ఆయనకు.. ఆయన కుటుంబానికి భజన చేసే భక్తమండలి అంటే ఆయనకు చాలా మక్కువ. ఆ భజన బృందం ఆయన ప్రతీ సినిమాలో కనిపిస్తుంటుంది. చిరంజీవిపై ఎలాంటి విమర్శలు వచ్చినా.. ఈ భజన బృందం ఆ వ్యక్తిని టార్గెట్ చేసి విమర్శించడం చాలా సార్లు చూశాం. అంతేనా.. తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకునే సోషల్ మీడియా మెగా ఫాన్స్ కు కూడా చిరంజీవి ఆశీస్సులు మెండుగా ఉన్నాయనేది ఓపెన్ సీక్రెట్. చిరంజీవికి రాజకీయాలతో సంబంధం లేకపోయినా… గత ఎన్నికల్లో ఈ మెగా ఫాన్స్ జనసేనకు సపోర్ట్ చేశారు… పోస్టులు వేశారు. దాని వెనుక ఉన్నది చిరంజీవే అయినా.. ఇప్పటికీ తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదంటారు చిరంజీవి.

ఇలా చిరంజీవి లోపల ఒక చిరంజీవి ఉంటే బయట మరో చిరంజీవి కనిపిస్తుంటారు. చాలా సార్లు చిరంజీవిలోని మరో వ్యక్తి బయటపడినా.. ఈ మధ్య ఎందుకో తరచూ బయటకు వస్తూ ఆయన్ను ఇరకాటంలో పడేస్తున్నారు. వరుసగా సినిమా ఫంక్షలకు హాజరవుతున్న చిరంజీవి… నోరు జారుతూ పరువు పోగొట్టుకుంటున్నారు. గతంలో సోనియాతో.. ప్రస్తుతం మోడీతో కలిసి చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న చిరుని నేషనల్ మీడియా కూడా బాగానే గుర్తిస్తోంది. దీంతో ఆయన మాటలను హిందీ, ఇంగ్లీష్ లో కూడా తర్జుమా చేస్తూ నేషనల్ మీడియా కథనాలను నడిపిస్తోంది. తెలుగు హీరోలంతా సినిమాలతో పాన్ ఇండియా లెవల్ లో ఇరగదీస్తుంటే… చిరంజీవి మాత్రం తన వివాదాస్పద వ్యాఖ్యలతో పాన్ ఇండియా లెవల్ ల్లో హైలెట్ అవుతున్నారు.

మొదట సరిలేరు నీకెవ్వరు.. ఆ తర్వాత గరికపాటి ఇష్యూ.. ఇప్పుడు రాజకీయాలు, తన కుటుంబం, కుటుంబసభ్యుల గురించి ప్రస్తావించి.. అక్కడున్న వాళ్లతో నవ్వులు పూయిస్తూ… బయట నవ్వులపాలువుతున్నారు. ఏదో ఒకసారి పొరపాటున మాట్లాడారులే అనుకునే లోపే ఇంకో అంశాన్ని ప్రస్తావిస్తూ.. కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు చిరంజీవి. పోయిన రూపాయి అయినా తిరిగి వస్తుందేమో కాదు.. నోరు జారిన మాట మాత్రం ఎప్పటి తిరిగిరాదన్న విషయాన్ని చిరంజీవి మరిచిపోయినట్లు కనిపిస్తోంది.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్