లిక్కర్ మార్ట్ లో తనిఖీలు

     విదేశీ మద్యం విక్రయాల్లో ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా ఎగవేసిన ఆధారాలను రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ సేకరించింది. హైదరాబాద్‌లోని ‘టానిక్‌’, వాటి అనుబంధ మద్యం దుకాణాలు, గోదాముల్లో అధికారులు తనిఖీ చేశారు. జీఎస్టీ, వ్యాట్‌ ఎగవేత ఆధారాలు సేకరించారు. మద్యం అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం‘వ్యాట్‌’ వసూలు చేస్తోంది. రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ గోదాముల నుంచి దుకాణాలకు మద్యం నిల్వలు తీసుకెళ్లే వ్యాపారులు ఎంత వ్యాట్‌ చెల్లించా రనే వివరాలను బిల్లులపై రాయాలి. వ్యాట్‌ ప్రస్తావ న లేకుండానే మద్యం నిల్వలను ఈ దుకాణాలకు పంపుతున్నా..ఏళ్ల తరబడి బీసీఎల్‌ పట్టించుకో కపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఎంత మద్యం విక్రయించారు, ఎంత వ్యాట్‌ చెల్లించారనే వివరాలను ఈ దుకాణాల వ్యాపారులు పూర్తిగా ఇవ్వలేదని తెలుస్తోంది.

     2016లో 271 ప్రత్యేక జీవో ద్వారా గత ప్రభుత్వం ఎలైట్ టానిక్ షాప్‌కు పర్మినెంట్ లైసెన్స్ జారీ చేసింది. ఐదు సంవ త్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కాగా… మొదటి మూడు సంవత్సరాలు లిక్కర్ అదనపు అమ్మకాలపై ఎలాంటి ప్రివిలేజ్ ఫీజ్ చెల్లిచకుండా వెసలు బాటు కల్పించారు. 2016లో ప్రభుత్వ నోటిఫికేష న్‌కు టానిక్ బేవరేజెస్ ఒక్కరు మాత్రమే టెండర్ కోడ్ చేయడం గమనార్హం.

‘టానిక్‌’వైన్‌షాప్‌తోపాటు వాటి అనుబంధ సంస్థలుగా ఉన్న మరో 8 ‘క్యూ’ మద్యం దుకాణాల్లో ఎక్సైజ్‌ విభాగం తనిఖీలు నిర్వహించింది. పన్ను ఎగవేత ఆరోపణలతో ఈ దుకాణాలపై వాణిజ్యపన్నుల శాఖ తనిఖీ చేస్తున్న క్రమంలో ఎక్సైజ్‌ శాఖ సైతం రంగంలోకి దిగింది. విదేశీ మద్యం విక్రయ అనుమతులు కలిగిన టానిక్‌ షాప్‌ నుంచి అనుబంధ సంస్థల్లోకి విదేశీ మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో దొరికిన ఆధారాలతో ఎక్సైజ్‌ శాఖ చర్యలు తీసుకో నుంది.

Latest Articles

వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల

మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్