స్వతంత్ర వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీకి గుడ్ న్యూస్. ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదల కాబోతున్నారు. ఏపీ స్కీల్ డెవలప్మెంట్ స్కాం లో భాగంగా చంద్రబాబు నాయుడుకు ఇవాళ బెయిల్ వచ్చింది. ఈ కేసులో చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు. కేవలం నాలుగు వారాల పాటు మాత్రమే చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. అనారోగ్యం కారణంగానే ఈ కేసులో చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు. చంద్రబాబుకు వచ్చే నెల 24వ తేదీ వరకు బెయిల్ మంజురు చేసింది కోర్టు. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. అలాగే పబ్లిక్ మీటింగ్‌లు పెట్టొద్దని చంద్రబాబుకు షరతులు జారీ చేసింది. తదుపరి విచారణ నవంబర్ 28కి వాయిదా వేసింది కోర్టు. ప్రధాన బెయిల్ పై నవంబర్ 10న విచారణ సాయంత్రం 5 – 7 గంటల మధ్య చంద్రబాబు విడుదల కానున్నారు.కాగా 52 రోజుల కిందట చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
ఇవాళ సాయంత్రం 5 గంటలకు చంద్రబాబు విడుదల
0
321
Next article
Latest Articles
నిలోఫర్ బిల్డింగ్ ఫైర్ NOC సస్పెండ్
బంజారాహిల్స్‌లోని నిలోఫర్ బిల్డింగ్‌ను ఫైర్ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా భవనం పైభాగంలో రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగుతున్నట్లు తేల్చారు. తక్షణమే...
- Advertisement -
- Advertisement -


